కరోనా బాధితులకు తగిన వైద్య సహాయం అందక పోవడం వల్ల ఎంతోమందిని కోల్పోతున్నామని జనసేన పార్టీ జగ్గంపేట ఇంచార్జ్ శ్రీ పాతంశెట్టి సూర్యచంద్ర గారు అన్నారు. గ్రామాల్లో కరోనా బాధితులకు వైద్య సేవలు అందించే ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల వద్ద పల్స్ ఆక్సిమీటర్లు, ధర్మల్ స్కానర్లు లేకపోవడం వల్ల జ్వరం తీవ్రత, ఆక్సిజన్ లెవెల్స్ చూడటానికి కుదరటం లేదు. ఈ రెండు పరికరాలు ఏర్పాటు చేస్తే వారి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా తెలుస్తుందని తద్వారా వారికి తగిన మందులు ఇవ్వటం కానీ తీవ్రత ఎక్కువగా ఉంటే హాస్పిటల్ కి పంపించడం జరుగుతుందని వైద్య సిబ్బంది అందరూ కోరుచున్నారు. మరియు కరోనా రోగులకు వైద్యం చేస్తున్న ఆశ కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు డాక్టర్లకు మాస్కులు, శానిటైజర్ లు,ఫేస్ షీల్డ్స్ సర్జికల్ గ్లౌజ్ లు పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల రోగుల దగ్గరకు వెళ్ళడానికి వారు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ద్వారా మా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకు కరోనా సామగ్రి కిట్లు సామాగ్రి అందజేసి తద్వారా మెరుగైన వైద్య సేవలు కోసం ప్రయత్నిస్తున్నాము అన్నారు. ఇప్పటివరకు 50 మంది ఏఎన్ఎంలకు, 70 మంది ఆశా కార్యకర్తలకు, కాట్రావులపల్లి, రాజపూడి ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉన్న వైద్యులు మరియు వైద్య సిబ్బందికి థర్మల్ స్కానర్స్, పల్స్ఆక్సిమీటర్లు, ఫేస్ షీల్డ్ లు, సర్జికల్ గ్లౌజులు, N95 మాస్కులు, PPE కిట్లు, హెయిర్ క్యాప్ లు, శానిటైజర్ లు అందజేసామని అన్నారు.