పిఠాపురం ( జనస్వరం ) : పిఠాపురం పట్టణంలోని కత్తులగూడెం వార్డు 23లో పెడిరెడ్ల భీమేశ్వరరావు, దంట వీరబాబుల ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు జనసేన పార్టీలోకి నియోజకవర్గ ఇంఛార్జి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ సమక్షంలో జాయిన్ అయ్యారు. ఈ చేరికల్లో మహిళలు అధిక సంఖ్యలో చేరడం పార్టీకి శుభపరిణామన్నారు. సుమారు 110 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో జాయిన్ అయిన మహిళలు మాట్లాడుతూ వృద్ధులకు పించను ఇవ్వలేదని, జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. వార్డులో కుళాయిలు ఉన్నాయిగానీ కుళాయిల్లో గాలితప్ప నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవని ఉదయ్ శ్రీనివాస్ వద్ద వాపోయారు. తమకు ఇళ్ళ పట్టాలు ఇచ్చారుగానీ ఇంటి స్థలం ఎక్కడ ఉందో చెప్పలేదన్నారు. ఈ సంధర్భంగా ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన టిడిపి ప్రభుత్వం ఏర్పడ్డాకా సొంత ఇళ్ళులేని ప్రతీ ఒక్కరికీ టౌన్ పరిధిలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు మరియు స్థానికులు పాల్గొన్నారు.