
ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస జనసేనపార్టీ ఆఫీసులో జరిగిన ప్రెస్ మీట్ లో ఆమదాలవలస జనసేన ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇస్తున్న జగన్నన్న ఇల్లు అతిపెద్ద స్కాంగా జనసేనపార్టీ నమ్ముతుందని,భూమి కొనుగోలు, మౌలిక వసతుల కల్పనలో వేలకోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. ఈ నెల 12,13,14 వ తేదీలలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నాదెండ్ల మనోహర్ సూచనలతో రాష్ట్రవ్యాప్తంగా “జగన్నన్న ఇల్లు -పేదలందరికి కన్నీళ్లు” అనే కార్యక్రమం ద్వారా #జగన్నన్న మోసం అనే నినాదంతో సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 28.30 లక్షల ఇల్లు నిర్మిస్తామని చెప్పి మొదట విడతగా 15.10 లక్షల ఇల్లు జూన్ 2022కి పూర్తి చేస్తా అన్నారు కానీ జూన్ దాటి ఐదు నెలల గడుస్తున్నా రాష్ట్రంలో ఒకలక్ష యాభై వేల ఇల్లు మాత్రమే పూర్తి చేసారని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 68 వేల 677ఎకరాల భూమిని 23 వేల 500 కోట్లతో కొనుగోలు చేసారని అలాగే మౌలిక సదుపాయాల కోసం 34 వేల కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పారని కానీ ఏ ప్రాంతంలో కూడా జగన్నన్న కాలనీలో కనీసం రోడ్డు, డ్రైనేజీ, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దయనీతి పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా 12,13 తేదీలలో రాష్ట్ర ప్రజలకు తెలియజేసి 14 వ తేదీన సోషల్ ఆడిట్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఆమదాలవలస నియోజకవర్గ నాలుగు మండలాలలో జనసేన నాయకులు, కార్యకర్తలతోను జరుపుతామని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో ఆమదాలవలస జనసేన నాయకులు పైడి.మురళి మోహన్, గంగు కోటేశ్వరరావు, రాము, బొగ్గు సురేష్, అశోక్, పాల్గొన్నారు.