Logo
Date of Publish : 23 November 2021, 11:10 am
Editor : Sake Naresh

జగన్మోహన్ రెడ్డి వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి : జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

• ప్రజలు కష్టాలుపడుతుంటే ఏరియల్ సర్వే చేసి వెళ్ళిపోయారు.

• జనసేన బృందాలు బాధితుల సేవలో ఉన్నాయి

• తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో జనసేన పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు.

       తిరుపతి, (జనస్వరం) : భారీ వర్షాలు, వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి పలకరించే దిక్కు లేకుండా పోయిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కదలరు.. ఆయన వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యమంత్రి అన్నారు. ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని వ్యక్తిగా శ్రీ జగన్ రెడ్డి తయారయ్యారు అని చెప్పారు. జల విలయం వల్ల నష్టపోయిన చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించేందుకు మంగళవారం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తిరుపతికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడారు, శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ " ప్రజలు కష్టాలు పడుతుంటే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి జిల్లాకు రూ.2 కోట్లు సాయం ప్రకటించడం విడ్డూరంగా ఉంది. బాధ్యత కలిగిన ఒక రాజకీయ పార్టీగా ప్రజలు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలిచేందుకు వచ్చాం. పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు, నిత్యావసర సరుకుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టాం. జనసేన పార్టీ తరఫున వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు విడతల పర్యటనలు జరపాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. మొదటి విడతగా తాను పర్యటించి వరద నష్టంపై అంచనాలు రూపొందిస్తాం. రెండో విడత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటిస్తారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే వరకు జనసేన పార్టీ పోరటం చేస్తుందని అన్నారు. శ్రీ మనోహర్ గారికి జనసేన పార్టీ నేతలు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ కిరణ్ రాయల్, శ్రీమతి వినూత కోట, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీ సుంకర శ్రీనివాస్, శ్రీ కొట్టి వెంకటేశ్వర్లు తదితరులు తిరుపతి విమానాశ్రయంలో  స్వాగతం పలికారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com