Search
Close this search box.
Search
Close this search box.

దివ్యాంగుల హక్కులను అడ్డుకుంటున్న జగన్మోహన్ రెడ్డి : జనసేన నాయకులు గోగన ఆదిశేషు

      బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ ఈనెల 6 సోమవారం నాడు విజయవాడ ధర్నా చౌక్ లో దివ్యాంగుల మహాధర్నా కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు పెద్దవారు అందరు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ధర్నా విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మూడు సంవత్సరాల పాలనలో దివ్యాంగులకు ఒక చిన్న పని కూడా చేయకుండా దివ్యాంగుల హక్కులను సాధించుకుందాం అని ధర్నాలు చేస్తూ ఉంటే దానికి అడ్డుకుంటూ దివ్యాంగుల సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చి భయపెడుతున్న జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయత్నాన్ని మానుకొని వెంటనే హక్కులను సాధించుకునే విధానముగా ప్రయత్నించాలని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో  కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way