అనంతపురం ( జనస్వరం ) : ఉరవకొండ నియోజకవర్గంలో ఇస్తున్న పథకాలకే ప్రతి సంవత్సరం ఏదో కొత్త పథకాలు ప్రారంభించి ఇస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ? వేదిక పైన పచ్చి అబద్ధాలు? అంకెల గారడి? చేస్తూ అనంతపురం జిల్లా ప్రజలని, రాష్ట్ర ప్రజలని నమ్మించాలని చూస్తున్నారు. దురుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చొప్పే మాయ మాటలు అంకెల గారడీని రాష్ట్ర ప్రజలు ఇక నమ్మరు? బాయ్ బాయ్ జగన్ అంటున్నారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జయరాంరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ అయ్యా జగన్ మోహన్ రెడ్డి గారు గతంలో మీ పాదయాత్రలో అనంతపురం జిల్లాకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారా ? 10 15 రోజుల్లో మీ పాలన ముగుస్తా ఉందన్నారు. సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల ఇంకెప్పుడు పూర్తి చేస్తారు? అనంతపురం జిల్లాకు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని అన్నారు. మీ పాలనలో రైతులుకి ఏమన్నా మంచి జరిగిందా? డ్రిప్ ఇరిగేషన్ ఇంకెప్పుడు రైతులకు అందిస్తారు? రాష్ట్రవ్యాప్తంగా నిరుపేదలకు 30 లక్షల గృహాలు ఇచ్చాం ఉరవకొండ నియోజకవర్గంలో 8 వేల గృహాలు ఇచ్చామంటున్నారు? ఇంకెన్ని రోజులు ఈ కథలు చెపుతారని అన్నారు. లబ్ధిదారులకు ఇంకెప్పుడు నిర్మించి ఇస్తారో చెప్పగలరా? రాష్ట్ర అభివృద్ధిని పూర్తిగా విస్మరించి, సంక్షేమ పథకాల రూపంలో 2లక్షల 53 వేల కోట్లు ప్రజలకు ఇచ్చామంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక దాదాపు పది లక్షల కోట్లు అప్పులు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడికెళ్ళింది? గతంలో పాలించిన వారు దోచుకొని దాచుకొని పంచుకున్నారో లేదో కానీ నీ ముఠా మాత్రం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందనేది మీరు చేసిన అప్పులు బట్టి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది, ఇసక మద్యంలో వేలకోట్లు మీ ముఠా దోచుకున్నది, దాచుకున్నది వాస్తవం కాదా? అని అన్నారు. పాదయాత్రలో మీరు ఇచ్చిన హామీలలో భాగంగా అంగన్వాడి అక్కచెల్లెమ్మల న్యాయమైన కోరికలు తీర్చడానికి నీకు మనసు రాలేదా? ఆశా వర్కర్ల పరిస్థితి ఏంటి? మున్సిపాలిటీ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ఎప్పుడు పరిష్కరిస్తారు? కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లు ఎప్పుడు పరిష్కరిస్తారు?అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారు? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ఇంకెప్పుడు? మీరు అధికారంలోకి రావడానికి పాదయాత్రలో ఇచ్చిన హామీలలో కనీసం 10% కూడా నెరవేర్తించకుండా మరలా రాష్ట్ర ప్రజలకు మాయమాటలు చెబుతూ తప్పుడు ప్రచారంతో అధికారంలోకి రావాలని చూస్తున్నారు? ప్రజలకు మీ దురాశ దుర్బుద్ధి స్పష్టంగా అర్థం అయిపోయింది, ఇంక నిన్ను ఎవరూ నమ్మము జగనన్న అంటున్నారని ధ్వజమెత్తారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com