బాపట్ల ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికాముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66 వర్ధంతి ఘన నివాళులు తెలియజేసామని అన్నారు. అంబేద్కర్ గారి ఆశయాలను అవమాన పరుస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అవుతున్న దివ్యాంగులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. నాలుగుసార్లు డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాలకు రాకుండా దివ్యాంగులను అంటరాని వాళ్ళలాగా చూస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటుతోనే 2024లో ఓడించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంటా నాగమల్లేశ్వరరావు, దేవి రెడ్డి శ్రీనివాసరావు, కుంటా సూరయ్య పాల్గొన్నారు.