జగ్గంపేట ( జనస్వరం ) : జనసేన పార్టీ అద్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా జగ్గంపేట నియోజకవర్గంలో ప్రారంభించిన జనం కోసం జనసేన మహాయజ్ఞం కార్యక్రమం. అందులో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వీలైనంత వరకు వాటిని పరిష్కరిస్తున్న జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర గారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోనీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ జనం కోసం జనసేన అనే మహాయజ్ఞం ద్వారా ఇప్పటికే చాలా ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది అని అన్నారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న "పేదలందరికీ ఇళ్ళు" పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వకుండా వారికి నచ్చిన వారికే, ఇళ్ళ స్థలాలు ఉన్న వారికే మళ్ళీ మళ్ళీ ఇళ్ళ పట్టాలు ఇచ్చుకుంటూ ఉన్నారని అసలైన నిరు పేదలకు ఇంకా చాలా మంది సొంత ఇళ్ళు లేక అనేక సంవత్సరాలుగా అద్దె ఇళ్లలోనే ఉంటూ, ఈ పెరిగిన రేట్లతో ఎంతో భారంగా అద్దెలు కట్టుకుంటూ చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి సొంత ఇళ్ళు లేని నిరు పేదలను గుర్తించి వెంటనే వారికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com