- అడ్రస్ ప్రూఫ్ లేకుండా చేసిన సీఎం జగన్
- మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరు
- జనవాసాలకు దూరంగా జగనన్న కాలనీలు
- ఇటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా జగనన్న కాలనీలు
మంగళగిరి, (జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు శనివారం మంగళగిరి మండలం, ఆత్మకూరు జగనన్న కాలనీని పరిశీలించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీవాసులు మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడుతూ "మాకు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని, మమ్మల్ని తీసుకొచ్చి పొలాల మధ్యలో స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని, ఆ కాలనీకి వైసిపి వాళ్లు జగనన్న కాలనీ అని పేరు పెట్టుకుని, మాకు ఎటువంటి వసతులు లేకుండా చేశారని, సాయంత్రం అయితే చాలు మద్యం తాగి రోడ్డు మీద వచ్చే వాళ్ళని అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మాకు రక్షణ లేకుండా పోతుందని, మా కాలనీకు రావడానికి కనీసం రోడ్లు లేక, మంచినీటి, వైద్య సదుపాయం, మా సమస్యలు వినిపించుకుంటానికి ఒక సచివాలయం, రక్షణ సిబ్బంది లేకా ఇబ్బంది పడుతున్నాం" అని వివరించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ "మౌలిక సదుపాయాలు అయినటువంటి వైద్యం, విద్య, రక్షణ ప్రభుత్వ సిబ్బంది అందుబాటులో లేరు మమ్మల్ని పట్టించుకునే నాధుడే లేరని ఇక్కడి ప్రజలు అంటున్నారని, అత్యవసర సమయాల్లో వైద్యం అందక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని, సీఎం జగన్ ఇంటిదగ్గర సెక్యూరిటీ నెపంతో తొలగించిన వారిని జగనన్న ఇంటి పథకం కింద మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో 12 ఎకరాల స్థలంలో వైయస్సార్ జగనన్న కాలనీ ఏర్పాటు చేశారు. స్థానిక శాసనసభ్యులు ఆర్కే వారికి రెండు సెంట్ల భూమిలో ప్రభుత్వ ఖర్చులతో ఇంటి నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ కాలనీకి వెళ్లడానికి నేషనల్ హైవే నుండి ఉన్న కరకట్ట రోడ్డు లేదా మంగళగిరి తెనాలి రాహదారులు మాత్రమే ఈ రెండు రహదారులు పూర్తిగా ఎర్ర మట్టి రోడ్లు వర్షాకాలంలో ప్రయాణం ప్రమాదకరం మంగళగిరి - విజయవాడ నుండి ఎలాంటి రవాణా సౌకర్యాలు లేని ప్రదేశం పూర్తి నిర్మాణం ప్రభుత్వం చేసి ఇవ్వకుండా 1,80,000 మాత్రమే అవి కూడా విడతల వారీగా ఇస్తున్నారు. ఈ 1,80,000 కూడా కేంద్ర ప్రభుత్వం పథకం కింద ఇచ్చేవే గ్రామ సచివాలయం లేదు అలాగే ఆత్మకూరు పంచాయతీ కింద కాలనీ ఆ గ్రామానికి వెళ్ళడానికి కూడా రహదారి లేదు. ఈ జగనన్న కాలనీలలో సరైన తాగునీరు సదుపాయం లేదు స్థానిక బోరు నుండి వచ్చే నీటి వలన అక్కడి పిల్లలకు పెద్దలకు చర్మ సంబందిత వ్యాధులతో అనారోగ్యం పాలవుతున్నారు. జగనన్న కాలనీలోని కుటుంబాలకు అసలైన మౌలిక సదుపాయాలు భద్రత ఆరోగ్యం విద్యా వైద్యం మంచినీళ్లు మొదలగు ముఖ్య సదుపాయాలు లేవు సచివాలయ సిబ్బంది గాని, వాలంటీర్ వ్యవస్థ గాని, వీరికి లేదు ముఖ్యంగా ప్రయాణ సదుపాయం లేదు డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంది. దాని వలన అక్కడి ప్రజలకు అనారోగ్యం చిన్నారులకు అంగన్వాడి స్కూల్ మరియు పాఠశాలలు కూడా లేవు. జనవాసాలకు దూరంగా కనీస మౌలిక సదుపాయాలు లేకుండా గిట్ల మమ్మల్ని అడివిలో పడవేసినట్టు అక్కడ ప్రజలు తెలియజేస్తున్నారు. చాలా గృహాలు ఇంకా నిర్మాణ పునాది పనులను నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000 కనీసం పునాది కూడా ఏర్పడటం లేదు. కొందరైతే ఇళ్ల స్థలం కేటాయించినప్పటికీ కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం ఆత్మకూరు వైయస్సార్ జగనన్న కాలనీ వాసులకు రోడ్డు రవాణా, రక్షణ, విద్య, వైద్యం, త్రాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించాలని మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం" అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, రాష్ట్ర జనసేన పార్టీ ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీ రావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ సుభాని, మంగళగిరి పట్టణ మైనార్టీ నాయకులు షేక్ కైరుల్లా, మంగళగిరి మండల ఉపాధ్యక్షులు బత్తినేని అంజయ్య, నాగభూషణం, మంగళగిరి మండల ప్రధాన కార్యదర్శి అప్పికట్ల శివ బాబు, మంగళగిరి పట్టణ సీనియర్ నాయకులు కొండపాటూరి చంద్రశేఖర్, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు జోసెఫ్ తంబి, బేతపూడి గ్రామ నాయకులు వాసా శివన్నారాయణ, మంగళగిరి నియోజకవర్గ ఐటీ విభాగం కోఆర్డినేటర్ రాకేష్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, మంగళగిరి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ లేళ్ళ సాయి నందన్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, జన సైనికులు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com