Logo
Date of Publish : 14 November 2022, 3:58 pm
Editor : Sake Naresh

నాణ్యత లేని, గొయ్యలు తీయకుండానే జగనన్న పునాదులు : విజయనగరం జనసేన నాయకులు

           విజయనగరం ( జనస్వరం ) : జగనన్న ఇళ్లల్లో మోసాలను ప్రజలకు తెలియజేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మూడో రోజైన సోమవారం ఉదయం జనసేన పార్టీ ఆధ్వర్యంలో విజయనగరం నియోజకవర్గంలో కొండ వెలగాడలో ఉన్న టిట్కో ఇళ్లులు, కొండకరకాం లో జగనన్న లేఅవుట్ ను జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు,జమ్ము ఆదినారాయణ, రౌతు సతీష్, లాలిశెట్టి రవితేజ, ఏర్నాగుల చక్రవర్తి, పొట్నూరు చందు, పిడుగు సతీష్, త్యాడ రామకృష్ణారావు (బాలు), వీర మహిళల గంట్లాన పుష్పకుమారి, పాల్గొని నిరసన తెలిపారు. అనంతరం గోయ్యలు తీయకుండా, నాణ్యత లేకుండా తీస్తున్న జగనన్న పునాదులను చూసి అవాక్కయ్యి, ఏంటండీ ఈ ఘోరం అనిఆడుగుగా వెంటనే హౌసింగ్ ఎ.ఈ ,సచివాలయం సిబ్బంది జనసేన నాయకులపై విరుచుకుపడ్డారు.. చివరకు వారిచ్చిన లక్షా ఎనభై వేలకు ఎలా కట్టమంటారు అని ఆఖరకు ప్రభుత్వ అధికారులు, నాయకులు ఏలాచెబిటే అలా చేయాలని ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ ఆదివారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యన అనంతరం స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తో పాటు, సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర,పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగారావు, ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాస్ రావు, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, జెడ్.పి చైర్ పర్సన్ చిన్న శ్రీను, ఎమ్మెల్సీ సురేష్ బాబు పవన్ కల్యాణ్ పై అవగాహన రాహిత్యంతో, పవన్ జన ప్రభంజనాన్ని తట్టుకోలేక, వైఎస్సార్సీపీ జగనన్న ఇళ్ళల్లో జరిగిన కుంభకోణాన్ని బయట పెట్టేసరికి కుక్కల్లా మోరిగారని, ఈ మొరిగిన ఎమ్మెల్యేలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒక్కటే చెబుతున్నాం... జిల్లా మొత్తం 55,5523 జగనన్న ఇల్లులు మంజూరుకాగా,నిర్మాణం చేపట్టిన 51,119 కీ ఇప్పటికీ కట్టిన ఇళ్ళులు కేవలం 3,647 ఇళ్లులు మాత్రమే అని,మిగతా సుమారు 48వేల ఇళ్లులు ఎన్ని సంవత్సరాలకు ప్రజలకు అందించ గలరని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన లక్షలకోట్లు ఏచేసారని, జగనన్న కాలనీల్లో కొలాయిలు, రోడ్లు,కాలువలు, బ్రిక్, కార్మికుల కాంట్రాక్టర్లు,ఎవరెవరిని పెట్టారో పేర్లతో సహా బయట పెట్టగలరా అని వైసిపి నాయకులపై దుయ్యపట్టారు. సినిమా టిక్కెట్లు అమ్ముకొని ఎలా నాయకులు అయ్యారో, సారా వ్యాపారాలు, భూకబ్జాలు, దందాలు, బినామీ కాంట్రాక్టర్లు పెట్టుకొని ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో జనసేన త్వరలో ప్రజలందరికీ తెలిసేలా జనసేన పోరాటం చేస్తుందని వైసిపి నాయకులకు హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలమేరకు ఈ జగనన్న ఇళ్లపై పోరాటం మరింత ఉదృతం చేస్తామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com