Logo
Date of Publish : 12 November 2022, 4:00 pm
Editor : Sake Naresh

జగనన్న కాలనీలు సాకారం కాని పేదల సొంతింటి కల : మాకినీడి శేషుకుమారి

            జగనన్న ఇల్లు - పేదలందరికీ కన్నీళ్లు అనే సామాజిక పరిశీలన కార్యక్రమంలో భాగంగా 12వ తేది మొదటిరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి గారు నియోజవర్గంలో గ్రామల్లో అవినీతి వైసీపీ ప్రభుత్వము ఏర్పాటు చేసిన జగనన్న కాలనీని పరిశీలించి అక్కడ పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను ఆమె పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం దేవుడేరుగ ముందు ఇక్కడికి రావడానికి సరైన రహదారి కూడా లేదు స్థానిక ఎమ్మెల్యే సొంత బంధువుల లాభం కొరకు ఊరికి దూరంగా ఉన్న భూములను మార్కెట్ రేటు కంటే ఎక్కువకు కొనుగోలు చేసి ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశారన్నారు. ఇటు ప్రజలకు కూడా న్యాయం చేయకుండా మూడున్నర సంవత్సరాలు వట్టి కాగితం చూపించి కొంతమందికి వారి స్థలం కూడా చూపించకుండా కాలం వెళ్లబోశారు. ఇప్పటికైనా నిద్రపోయిన ప్రభుత్వ యంత్రాంగం మేలుకొని పట్టలు ఇచ్చిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, వారి సొంత ఇంటి నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. గడప గడపకు కాదు మీరు ఇచ్చిన స్థలాల్లో కూర్చుని చూడండి వాటి పరిస్థితి మీకు అర్థమవుతుంది వర్షం వస్తే వాహనాలపై కాదు పడవ మీద రావాల్సి ఉంటుందని అన్నారు. తాటిపర్తి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను పరిశీలించి స్థానిక లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాటీపర్తి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలకు ఇరువైపులా హై టెన్షన్ వైర్లు, స్థలం మధ్యలో ఓఎన్జిసి గ్యాస్ పైపులు, కనీసం స్థలాలను కేటాయించారని, లబ్ధిదారులు ఇల్లు కట్టుకోవడం కూడా ఆసక్తి చూపటం లేదని ఈ వైఖరిని మీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించవల్సి వుంటుందని ఆమె విమర్శలు గుప్పించారు. అనంతరం కొడవలి గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన జగనన్న కాలనీలను పరిశీలించి స్థానిక లబ్ధిదారులను వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంత అక్రమాలకు పాల్పడిందో ఈ గ్రామానికి ఇచ్చిన స్థలాలు నిదర్శనం అని దాదాపు ఊరికి పది కిలోమీటర్ల దూరంలో కనీసం రోడ్డు సదుపాయం కూడా లేకుండా కొండల మధ్యలో ఇచ్చారు అన్నారు.ఈ కార్యక్రమంలో.గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ రామకృష్ణ వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, గోపు సురేష్ బుర్రా సూర్యప్రకాష్,దాసం కొండబాబు, మేళం బాబీ, యండ్రపు శ్రీనివాస్, సామినీడి అప్పారావు, అడబాల వీర్రాజు,నక్క నారాయణమూర్తి,గారపాటి శివ కొండారావు,పెద్దింటి శివ,పప్పినీడి దుర్గాప్రసాద్,నామ శ్రీకాంత్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com