పత్తికొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు CG రాజశేఖర్ మాట్లాడుతూ జగనన్న మరొక మోసం - ఫించన్ కోతఅని ధ్వజమెత్తారు. మన అన్న మాటతప్పడు - మడమతిప్పడు? ఎన్నికల ముందు నేను అధికారంలోకి వస్తానే 3000 పింఛన్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీగా 250 రూపాయలు ప్రతి సంవత్సరం పెంచుతానని చెప్పారు. ఈ సంవత్సరం 250 రూపాయలు పెంచే క్రమంలో దాదాపుగా లక్ష 70 వేల మందికి విచిత్రమైన కారణాలు చూపుతూ నోటీసులు ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వ ఉద్దేశం వీరందరికీ పింఛను తీసివేయాలని దురుద్దేశంతో ఈ నోటీసులు ఇచ్చారని అర్థమవుతుంది. తక్షణమే నోటీసులు ఇచ్చిన వారందరికీ పింఛను కొనసాగించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన వారందరికీ కూడా ఒకటో తారీఖున పింఛన్ అందజేయాలి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ ఒకటో తారీఖున జీతాలు ఇవ్వాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష డెబ్బై వేల మందికి పింఛన్ నిలిపివేయాలని చూస్తున్న వారి పక్షాన..... ప్రభుత్వ ఉద్యోగం విరమణ చేసిన ఫించన్ దారుల పక్షాన... రాష్ట్ర ఉద్యోగుల పక్షాన వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేని క్రమంలో వీరందరి తరపున జనసేన పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీస్తామని హెచ్చరిస్తున్నామన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com