నెల్లూరు సిటీ ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట 221వ రోజున 15వ డివిజన్ బాలాజీనగర్ ఆంధ్రాబ్యాంక్ సెంటర్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ తిరిగిన కేతంరెడ్డి ప్రజా సమస్యల అధ్యయనం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ అమెజాన్ వెబ్ సైట్ లో 12వేలకు దొరికే శాంసంగ్ టాబ్లెట్ ఫోన్లను 14వేలకు కొనుగోలు చేసి వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కి పాల్పడిందని అన్నారు. ఐదున్నర లక్షల టాబ్ లంటే ఒక్కోటి 9వేలకే దొరుకుతుందని, ఎందుకు అంత ఎక్కువ మొత్తానికి కొనుగోలు చేసారని అన్నారు. ఆ టాబ్ లలో లోడ్ చేసిన కంటెంట్ కు 750 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలు చెప్తున్నాయని, కానీ బైజూస్ సంస్థ మాత్రం ఉచితంగా అందించినట్టు ప్రకటించిందని, ఈ మతలబు ఏమిటని ప్రశ్నించారు. చిన్న పిల్లల చదువులను కూడా స్కామ్ లు చేసుకునేందుకు వైసీపీ ప్రభుత్వం వాడుకుంటోందని, రాష్ట్రంలో ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.