అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో... ఆదివారం 13వ తారీఖున మూడు జగనన్న కాలనీలు... చిన్మయ నగర్, బుక్కరాయసముద్రం మరియు ఉప్పరపల్లి జగనన్న కాలనీలు సందర్శించి లబ్ధిదారుల బాగోగులు తెలుసుకోవడం జరిగింది. చిన్మయ నగర్ నందు టిడ్కో గృహాల సందర్శన, అనంతపురం పట్టణ సమీపాన చిన్మయి చిన్మయి నగర్ లో... గత కొన్ని సంవత్సరాలుగా లబ్ధిదారులకు టీడ్కో ఇల్లు ఇవ్వకుండా మనోవేదనకు గురి చేస్తున్నారు. ప్రజా సంపదను వేలకోట్లు దుర్వినియోగం చేస్తున్నారు. బుక్కరాయసముద్రం జగనన్న కాలనీ బుక్కరాయసముద్రం గ్రామ సమీపన కొండగుట్టలో లబ్ధిదారులకు 1600 ఇండ్లు కేటాయించి కనీస సౌకర్యాలు నీరు, రహదారులు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం ఇచ్చే 1,80,000 సరిపోక ప్రజల అప్పులు చేసి గృహాలు నిర్మించుకోవలసిన పరిస్థితి కల్పించారు. నిరుపేదల దగ్గర డబ్బులు లేక కనీసం ఇంతవరకు 10 గృహాలు కూడా పూర్తిగా నిర్మించుకోలేకపోతున్నారు. ఉప్పరపల్లి దగ్గర జగనన్న కాలనీ : అనంతపురం చెరువు ముంపు ప్రాంతంలో లబ్ధిదారులకు గృహాలు కేటాయించడం వల్ల కాలనీలో నీళ్లు నిలిచి, పునాదులు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్న 1,80,000 రూపాయలు సరిపోవట్లేదు. భవిష్యత్తులో వర్షాలు అధికంగా వస్తే ఈ ప్రాంతం నీట మునిగిపోతుంది. జగనన్న నిరుపేదలకు మీరు ఇస్తున్న ఇల్లు ఇంకా ఎన్ని సంవత్సరాలకు పూర్తి చేసి ఇస్తారు? స్పష్టంగా లబ్ధిదారులకు చెప్పవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, అనంతపురం జిల్లా ఐటీ వింగ్ సభ్యులు గిరి ప్రసాద్ , మెరుగు శ్రీనివాసులు, భవాని నగర్ మంజునాథ్, వెంకటాద్రి నాయక్, దుర్గాప్రసాద్, నారా నాయక్, రవి నాయక్ మరియు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com