చిత్తూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి సూచన మేరకు క్షేత్రస్థాయిలో జగనన్న కాలనీల పరిశీలనలో భాగంగా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం గుండ్లపల్లి రెవెన్యూ గ్రామపరిధిలో గల జగనన్న కాలనీలో ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకం ద్వారా లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇంటర్నల్ రోడ్స్ ఇటీవల కురిసిన వర్షాలకు జలమయమై నీటి కుంటలను తలపిస్తూ, పూర్తిగా దెబ్బతిన్నాయి. తద్వారా లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం కొరకు కావలసిన ఇటుక సిమెంటు తదితర సామాగ్రిని ఇళ్ల వద్దకు తీసుకొని వెళ్ళుటకు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగాఅధికార పార్టీకి చెందిన కార్యకర్తలు మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలను తుంగలో తొక్కి తమకు ఏమీ వర్తించని విధంగా వారికి నచ్చినట్లు రెండు ఇండ్లు కట్టే నిర్మాణ స్థలంలో ఒకే ఇంటి నిర్మాణం చేపట్టడం గమనార్హం. కాగా, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తూ వైసీపీ వారికి కొమ్ము కాస్తూ వారి చర్యలను సమర్థించడం అధికార యంత్రాంగ స్వామిభక్తి కి, అధికార పార్టీ ద్వందనీతికి నిదర్శనం. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నిర్మాణాలు చేపడుతున్న జగనన్న కాలనీలలో అవతలకు గుండ్లపల్లి జగనన్న కాలనీయే నిదర్శనం ఎక్కడ కానీ జగనన్న కాలనీలలో కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం ప్రభుత్వ చేతగానితనమని ఏపీ శివయ్య విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం జగనన్న కాలనీలలో మౌళిక వసతుల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని శివయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సిద్ధమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.