Logo
Date of Publish : 30 November 2022, 3:43 pm
Editor : Sake Naresh

జగనన్న కాలనీలు పెద్ద స్కామ్ లా మారాయి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 198వ రోజున 43వ డివిజన్ దారాల వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇళ్ళు లేని పేదలందరికీ ఇళ్ళు కట్టిస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఊరు చివర బీడు భూములను తమ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల చేత కొనిపించి అధిక ధరలకు విక్రయించి రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడిందని అన్నారు. జగనన్న కాలనీల పేరుతో పనికిరాని పట్టాలను పేదల చేతికిచ్చి ఆ బీడు భూములను గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా పేదలకు కట్టివ్వలేదని ఈ స్కామ్ ని ప్రజలందరూ గ్రహించారని అన్నారు. రానున్న ఎన్నికల తర్వాత ప్రజలందరి ఆశీస్సులతో ఏర్పడబోయే పవనన్న ప్రభుత్వంలో ఈ స్కామ్ అంశాలను వెలికితీసి బాధ్యులను శిక్షించి పేదలందరికి ఇళ్ళు కట్టిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com