అనంతపురం ( జనస్వరం ) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అంగన్వాడిలందరూ వారి యొక్క ప్రధానమైన డిమాండ్ల అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేస్తున్న శాంతియుత సమ్మె కార్యక్రమానికి జనసేన పార్టీ తరపున పాల్గొని వారికి సంఘీభావం తెలిపిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మరియు అర్బన్ ఇంచార్జ్ టి.సి వరుణ్ మరియు రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలముందు పాదయాత్రలో భాగంగా అంగన్ వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్లు ఆయనను కలిసి వారి సమస్యలు చెప్పినప్పుడు మీకు జగనన్న ఉన్నాడు. అధికారంలోకి వస్తానే మీ జీతాలు పక్క రాష్ట్రం తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువగానే ఉండేటట్లు చేస్తానని రిటైర్ అవ్వగానే 5లక్షల డబ్బులు వచ్చేలా చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా రిటైర్ అమౌంట్ 50వేలు మాత్రమే వస్తుందని జీతాలు పక్క రాష్ట్రం తెలంగాణలో 14,500 వస్తుంటే మన రాష్ట్రంలో అంతకంటే తక్కువగా 11,500 రూపాయలు మాత్రమే ఇస్తూ అంగన్ వాడీ అక్కా చెల్లెమ్మాలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ముఖ్యమంత్రి ఇంకా అనేక గ్రామాలలో అంగన్వాడి సెంటర్స్ కి సొంత భవనాలు లేవు. బాడుగకు ఉన్న అంగన్వాడి సెంటర్స్ లో ప్రభుత్వం సరైన సమయంలో బాడుగలు చెల్లించక పోవడంతో గృహ యజమాని ఎక్కడ సెంటర్ని ఖాళీ చేపిస్తాడోనన్న భయంతో అంగన్వాడి వార్కర్లే అప్పు చేసి బాడుగాలు కట్టే పరిస్తితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఉందని సుప్రీంకోర్టే అంగన్వాడిలకి గౌరవ వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని గ్రాట్యుటరిని అమలు చేయాలని చెప్పింది కానీ జగన్ రెడ్డి వీటిని ఏపాత్రం పెడచెవిన పట్టించుకోకుండ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. అంగన్వాడిల జీవితాలతో ఆడుకుంటున్నాడని మేము జనసేన పార్టీ తరపున ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని శ్రీలత అన్నారు. అంగన్వాడిల న్యాయపరమైన కోరికలు తీర్చే వరకు వీరి సమ్మెకు జనసేన పార్టీ తరపున మద్దతుగా ఉంటామని తెలియజేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com