రాజంపేట ( జనస్వరం ) : ప్రజా వ్యతిరేక విధానాలతో నియంతృత్వ పాలన సాగిస్తున్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో పరాభవం తప్పదని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. రాజంపేట జనసేన ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు సుండుపల్లి జనసేన వీర మహిళ సుగుణమ్మ ఆధ్వర్యంలో శనివారం సుండుపల్లె టౌన్లో 142వ రోజు పవనన్న ప్రజాబాట నిర్వహించారు. జనసేన పార్టీ విధివిధానాలను తెలియజేస్తూ, జనసేన అధినేత రూపొందించిన కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. జనసేన-టిడిపి కూటమిలు విజయం సాధిస్తేనే అందరికీ ప్రయోజనం కలుగుతుందని గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. జగన్ మాయమాటలు నమ్మవద్దని ప్రజల సంక్షేమార్ధం కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, చౌడయ్య, కిషోర్, చంగల్ రాయుడు, చరణ్, జనసేన వీర మహిళలు సుగుణమ్మ లక్ష్మమ్మ, శిరీష, మాధవి, తదితరులు పాల్గొన్నారు.