నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై సీఎం జగన్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు జనసేన పార్టీ నెల్లూరు సిటీ కార్యాలయంలో పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవారిపై, ఆయన పెళ్ళిళ్ళ పై మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు ముందుగా ఆయన ఇంటిని చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. సీఎం జగన్ కుటుంబంలోనే బహుభార్యత్వాలు, బహు భర్తలు ఉండే వారు ఉన్నారని గుర్తుచేశారు. తల్లినీ, చెల్లినీ గెంటేసిన చరిత్ర సీఎం జగన్ కుటుంబానిది అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు విడాకులు పొంది మరలా వివాహం చేసుకుని చట్టబద్ధమైన జీవితాన్నే గడుపుతున్నారని, సీఎం జగన్ లాగా బెంగళూరు బంగ్లాలో భాగోతాలు నడపలేదని దుయ్యబట్టారు. సీఎం జగన్ బెంగళూరు భాగోతాలను లోడుతున్న కర్ణాటక కాంగ్రెస్ నేతకు వంద కోట్లు పంపడం వాస్తవం కాదా అని ఆరోపించారు. వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదానికి గురై చనిపోయిన సందర్భంలో జగన్ ఒకటిన్నర రోజు పాటు క్రూజ్ బోట్ లో ఎవరితో గడిపారో ప్రపంచం మొత్తానికి తెలుసని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారి జీవితం తెరచిన పుస్తకమని, సీఎం జగన్ లాగా అతుకుల బొంత కాదని అన్నారు. గంభీరంగా ఉన్నట్టు నటించే ఏనుగుకి నిద్రలో కలలో సింహం కనపడగానే ఉలిక్కిపడి లేచినట్లు సీఎం జగన్ పవన్ కళ్యాణ్ గారిని తలచుకోగానే ఉలిక్కిపడుతున్నారని, వారాహి విజయయాత్రలో పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అమ్మఒడి అంటూ పిల్లల మధ్యకు వెళ్లి అడల్ట్ సర్టిఫికేట్ మాటలను సీఎం జగన్ మాట్లాడారని, ఇప్పుడు నేతన్న నేస్తం అంటూ నేతన్నలను గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ గారిని స్మరించారని అన్నారు. వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో సీఎం జగన్ లేరు కాబట్టే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వాలంటీర్లకు ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థ అంటూ ఎక్కడ ఉందని, ఆ వ్యవస్థకు బాస్ ఎవరని ప్రశ్నించారు. వారు సేకరించే డేటానని ఎఫ్ఓఏ అనే ప్రయివేటు కంపెనీ ఎవరికి ధారాదత్తం చేస్తోందని నిలదీశారు. వాలంటీర్లు సేకరించే డేటా ప్రక్కదారి పట్టకుంటే, చోరీకి గురికాకుండా ఉంటే మరి రాష్ట్రంలో డేటాకి సంబంధించిన సైబర్ నేరాలు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఇటీవల నెల్లూరు జిల్లా ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి గారు ప్రజల వేలిముద్రల డేటాని దొంగిలించిన వారు 70 లక్షల రూపాయలని ప్రజల బ్యాంకు అకౌంట్లలో నుండి కాజేశారు అని చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం కాదని, పదే పదే సీఎం జగన్ ఇలాంటి తరహా విధానానికే వెళ్తే తాము కూడా పంథా మార్చుకుని వారి భాగోతాలన్నీ బట్టబయలు చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఏటూరి రవి, హేమంత్ రాయల్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com