Logo
Date of Publish : 06 September 2021, 3:29 pm
Editor : Sake Naresh

కరోనా కరువు కాలంలో..కరెంటు షాకులొద్దు జగన్ సారూ – నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్

     నెల్లూరు, (జనస్వరం) : పెరిగిన కరెంటు ఛార్జీలు మరియు ట్రూ అప్ ఛార్జీలు పేరిట అదనంగా వసూలు చేసిన, చేస్తున్న ఛార్జీల గురించి వ్యతిరేకిస్తూ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున విద్యుత్ కార్యాలయములో ఎస్.ఈ (ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్) గారికి వినతి పత్రం సమర్పించిన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గారు. ఈ సందర్భంగా కిషోర్ గారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో సామాన్యులకు కరెంట్ బిల్ కట్టడమే కష్టంగా ఉన్న కాలంలో, నాలుగు సంవత్సరాల ముందు వాడిన కరెంటు యూనిట్లను లెక్కగట్టి ట్రూ అప్  ఛార్జీల పేరిట ప్రతీ యూనిట్ పై ఒక రూపాయి ఇరవై మూడు పైసలు అదనంగా వసూలు చేయడం అమానుషం అని తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల జగన్ గారి పాలనలో, నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచాడు. అదీ చాలదన్నట్టు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు, కస్టమర్‌ ఛార్జిలు, విద్యుత్‌ సుంకంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో భారం అంతా సామాన్యులపై వేయడం కరెక్ట్ కాదన్నారు. నష్టాల్లో ఉన్న కరెంటు బోర్డు ను సవరించాలంటే ప్రభుత్వం నుంచి రావలసిన బకాయిలు పెడితే సరిపోతుందని సామాన్యులపై ఈ భారాన్ని మోపడం మానుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రములో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com