మదనపల్లి ( జనస్వరం ) : ఒక కుటుంబం గానీ, ప్రభుత్వం గానీ ఆదాయానికి మించి అప్పులు చేస్తే ఆ కుటుంబం లేదా ఆ ప్రభుత్వం దివాళా తీయడం ఖాయమని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికా ముఖంగా అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిస్థితి ఇలాగే ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు 2022-23 కి గానీ కేటాయించిన బహిరంగ మార్కెట్ లో రుణ సదుపాయాన్ని జగన్ సర్కార్ మొత్తం సంవత్సరంలో మూడో వంతు ఈ ఒక్క మే నెలలోనే తెచ్చేసింది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి మనకు కేంద్రం రూ.28,000 కోట్ల అవకాశం ఇచ్చింది. అంటే నెలకి రూ. 2,300 కోట్లు కానీ మన ప్రభుత్వం ఈ నెలలో 9,500 కోట్లు ఇప్పటికే తెచ్చేసింది. ఇంకోరకంగా చెప్పాలి అంటే రాష్ట్ర పన్ను, పన్నేతర ఆదాయం కంటే రుణం అధికం అన్నమాట. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి మన నెలసరి ఆదాయం రూ. 8,511 కోట్లు ఇది వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో చెప్పిన లెక్క. దీని ప్రకారం మనం ఆదాయం కంటే అప్పులు ఎక్కువ తెచ్చుకుంటున్నాం. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అవసరం కానీ మితి మీరిన సంక్షేమం అత్యంత ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దయచేసి అప్పుల కుప్ప చేయొద్దు ఆర్ధిక క్రమశిక్షణ పాటించండి. ఇలా అనాలోచిత రుణ సేకరణను జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.