Logo
Date of Publish : 13 October 2023, 8:35 pm
Editor : Sake Naresh

ఓటమి భయంతో, అభద్రతా భావంతో పవన్ కళ్యాణ్ పై జగన్ రెడ్డి వ్యక్తిగత దూషణ

      విజయనగరం ( జనస్వరం ) : జగన్ రెడ్డి ఓటమి భయంతో అభద్రతాభావంతో పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణ చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు డా.రవి కుమార్ మిడతాన తెలిపారు. కుటుంబం అంటే గౌరవం లేని వ్యక్తివి నువ్వు కాదా తన సొంత తల్లి, చెల్లి మీద చులకన భావం జగన్ రెడ్డిది,కుటుంబ వ్యవస్థ మీద గౌరవం ఉన్న వ్యక్తివి ఐతే దమ్ముంటే సొంత బాబాయి హత్య కేసు మీద పోరాడుతున్న చెల్లెలికి ఎందుకు మద్దతు ఇవ్వలేదు,తన రాజకీయ స్వలాభం కోసం సొంత కుటుంబంలోని తల్లిని చెల్లిని రోడ్లపై తెచ్చి రాజకీయంగా వాడుకొని ఈరోజు తన సొంత తల్లిని చెల్లినీ తరిమేసింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. ఈరోజు వారు ఆంధ్రా నుంచి గెంటితే తెలంగాణలో పడ్డారా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకో, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని నువ్వు, నిన్ను ఎన్నుకున్న పాపానికి రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయలేని చరిత్ర హీనుడువని అన్నారు. వారాహి యాత్ర ద్వారా  పవన్ కళ్యాణ్ గారు రోడ్లపైకి వచ్చి మీ పరిపాలన పై ప్రజల మధ్యన ఎండగడతా ఉంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు గురించి మాట్లాడడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిరంగ సభలలో న్యాయబద్ధంగా విడిపోయిన మహిళల ప్రస్తావన తెచ్చిన నీవు రాజకీయ అజ్ఞానివని అన్నారు. రాజ్యాంగం తెలియదు రాజ్యాంగ విలువలు తెలియని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటు. బహిరంగ సభలలో నాలుగున్నర సంవత్సరాల కాలంలో తను రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పవలసింది పోయి ప్రతిపక్ష నాయకులపై విమర్శలు మాత్రమే జగన్ రెడ్డి పంతాగా మారింది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియదు, ఎక్కడ నవ్వాలో తెలియదు, రాష్ట్రంలో పరిపాలన ఎలా చేయాలో తెలియదు, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలో తెలియదు. రాబోవు ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ ఏకమై జగన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారని అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com