నెల్లూరు ( జనస్వరం ) : జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మాట్లాడుతూ బటన్ నొక్కి డిజిటల్ పేమెంట్లు పంపగల సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత వారంలో మీరు నొక్కిన బటన్ అమ్మఒడి డబ్బు ఇంకా చాలామంది కి పడలేదు. ఎన్నో బట్టలు నొక్కిన మీకు డిజిటల్ పేమెంట్ ప్రాముఖ్యత తెలిసే ఉంటుంది… ఒకపక్క పది సంవత్సరాల నుంచి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటలైజ్ అవుతుంది ఇండియా అనేక ప్రచార మాధ్యమాల ద్వారా చెబుతూనే ఉన్నారు. అయినా అక్రమార్జన విషయం లో మీకు ఇవన్నీ కనపడవు,వినబడవు లేండి. మాట తప్పడం మడమ తిప్పడం అలవాటైన మీరు మద్యపానం పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఆడపడుచుల నల్లపూసలతో ఆడుకుంటున్న మీరు ప్రభుత్వ రెవెన్యూకి కూడా చిల్లు పడే చిల్లు కొడుతున్నారు. సొంత బ్రాండ్లతో ఎంత అమ్ముతున్నారు అని లెక్కలు ఎవరికి తెలుసు ఒకపక్క కోర్టు తీర్పులిచ్చినా, కేంద్రం వారించిన ఇదిగో చేస్తున్నాం అదుగో చేస్తున్నామని మద్యం మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్ల విషయం నాలుగు సంవత్సరాలుగా డిలే చేస్తూనే ఉన్నారు. టీ కొట్టు,పండ్ల బండ్ల దగ్గర నుంచి పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా డిజిటల్ పేమెంట్స్ అంగీకరిస్తుంటే.. ప్రజల ప్రాణాలతో ఆడుకునే భారీ వ్యాపారమైన మధ్య దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు అంగీకరించట్లేదు. ఈ విషయంలో బిజెపి పెద్దలు చెప్పినట్లుగా భారీగా నల్లధనం మార్పిడి జరుగుతుంది చేతులు మారుతుంది. ఈ రోజున బిజెపి పెద్దలతో కలిసి కలెక్టర్ గారికి డిజిటల్ పేమెంట్లు తప్పని సరి చేయవలసిందిగా అప్పుడే మద్యం ఎంత అమ్ముతున్నారు అని విషయం తెలిసే వచ్చి రెవిన్యూ రెవిన్యూ చిల్లు పడకుండా ఉంటుందని ఫిర్యాదు చేయడం జరిగింది. గతంలో మందు తాగి మంచాన పెడితే దాదాపుగా సంవత్సరాలు బతికేవారు, కొంతమంది జాగ్రత్తలు తీసుకుని తాగకుంటే ఆరోగ్యం మెరుగుపడే పరిస్థితి కూడా ఉండేది. జగన్ బ్రాండ్ వచ్చిన తర్వాత లివర్ ప్రాబ్లం వచ్చి జనాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. బిజెపి పెద్దలు చెప్పినట్లుగా మద్యపానం వల్ల ప్రాణాల పోయిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానన్న ప్రభుత్వం టార్గెట్లు ఇచ్చి అంచలంచలుగా వ్యాపారం పెంచుకుంటూ నే ఉంది. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బిజెపితో కలిసి పని చేసి ప్రజా ప్రభుత్వానికి అవకాశం వచ్చే విధంగా ప్రయత్నిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వైన్ షాపులలో ఎలైట్ షాపులలో డిజిటల్ పేమెంట్ లావాదేవీలు జరగాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాకు విజయలక్ష్మి కర్నాటి ఆంజనేయ రెడ్డి జనసేన నాయకులు కిషోర్, బిజెపి ప్రధాన కార్యదర్శులు బి శ్రీనివాసులు ఎర్రబోలు రాజేష్ వంశీధర్ రెడ్డి రఘునాథ్ రాజు మురళీకృష్ణమనాయుడు కుడుముల గిరికుమార్ గౌడ్ మిడతల రమేష్ పులిచెర్ల వెంకటనారాయణరెడ్డి యాకసిరి ఫణి రాజు కామేశ్వరమ్మ కాయల మధు కుప్పా ప్రసన్నమ్మ అశోక్ నాయుడు కందికట్ల రాజేశ్వరమ్మ పెద్ద రోశయ్య పిడుగు లోకేష్ సోషల్ మీడియా బాబు సురేష్జనసేన పార్టీ తరఫున ప్రశాంత్ గౌడ్, ఖలీల్, హేమచంద్ర యాదవ్, వర్షన్ వర, బన్నీ, మౌనిష్ తదితరులు పాల్గొన్నారు….
మొదలగు వారు పాల్గొన్నారు.