నెల్లూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి అధ్యక్షతన నగర కమిటీ ప్రధాన కార్యదర్శి మీదూరు వర కుమార్ ఆధ్వర్యంలో 51 డివిజన్, కపాడిపాళెం క్రిస్టిషన్ కమిటీ హల్ నందు జనసేన పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన కమిటీ సభ్యులతో స్థానిక సమస్యల వివరాల గూర్చి చర్చించారు. అనంతరం మీడియాతో చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరఫున 51వ డివిజన్ అధ్యక్షులు వర కుమార్ గారి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించడం సంతోషమని అన్నారు. సిటీ ప్రెసిడెంట్ సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలు ప్రజల బతుకు భారం జనసేన పార్టీ గడప గడపకి వెళ్లేటట్లు త్వరలో మేము గడపగడపకు స్టార్ట్ చేయబోతున్నాం. 51వ డివిజన్ బూత్ కమిటీ వేసుకోవడానికి కూడా ఈ సమీక్ష సమావేశం నిర్వహించాం. ముఖ్యంగా చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అట్టర్ ఫ్లాప్ అయింది అని ప్రజలందరూ అనుకుంటున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొచ్చారు ఎప్పుడు పోయారు అనీ, అసలు దేనికి వచ్చారని కూడా ప్రశ్నిస్తున్నారు.. అసలు నిజంగా నెల్లూరు ప్రజలను జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మోసం చేశారంట అంత మోసం చేశారు. శ్రీ దామోదరం సంజీవయ్య ధర్మల్ ప్లాంట్ ఏపీ జెన్కో ఆదానికి అంకితం చేసే డ్రామాలో జాతికి అంకితం అని చెప్తున్నారు. ఎంతో మంది రైతుల దగ్గర వారి భూమిని వందలాది ఎకరాలు తీసుకొని మీకు (ఏపీ జెన్కోలు ఉద్యోగాలు) ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి ఇప్పుడు ఉన్న టెంపరరీ జాబులు ఇచ్చి, కనీసం వాళ్ళు 200, 250 రోజుల నుంచి దీక్ష చేస్తున్నా పట్టించుకోకుండా ఒక దౌర్జన్యంలాగా ఒక రాక్షస పాలనకు నిదర్శనం లా ఉంది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధానం చూస్తున్నామని అన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు దాదాపు మూడు కిలోమీటర్లు బారికేడ్లు కట్టేస్తున్నారు. అన్ని నియోజకవర్గ అన్ని మండలాల నుంచి ప్రజలను తోలుతున్నారు. ముత్తుకూరు మండలం నుంచి మాత్రం ఎవరిని ఒక్కరిని కూడా రానివ్వలేదు. వచ్చిన వారు అక్కడ బాధలను తెలియజేస్తారనీ, సభలో గందరగోళం చేస్తారని, అన్యాయంగా భూములు లాక్కున్నారని చెప్తారని వారిని రానివ్వలేదు. టెంపరరీ ఉద్యోగస్తులు కూడా అక్కడకు వస్తే వాళ్ళని కూడా తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. నైట్ షిఫ్ట్ వాళ్ళని అక్కడే ఉంచేశారు. డే షిఫ్ట్ వాళ్ళని లోపలికి రానివ్వలేదు, ఎంతో అన్యాయం చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది కూడా మేము ఎంతో అన్యాయం అయిపోయాం ఈ ప్రభుత్వం తప్పుడు నిర్ణయాల వల్ల అనీ, రాక్షస పాలనకు ఇదొక ఉదాహరణ అని అన్నారు. జగన్ రెడ్డి హెలికాప్టర్లో వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి కనపడకుండా వెనక్కి వచ్చేస్తారు, బారికేట్లు కట్టేస్తారు, పరదాలు కట్టేస్తారు. ఇలా కట్టుకొని తిరిగే ముఖ్యమంత్రిని ఇంతవరకు ప్రజలు ఎప్పుడూ చూడలేదు. అంత దౌర్జన్యంగా అంత దారుణంగా ఈ పరిపాలన అందిస్తున్నారు.. పవర్ ప్లాంట్ ను ఆదానీ అంకితం చేస్తూ జాతికి అంకితం అంటున్నారు. మీరు నిజంగా అంకితం చేయాలనుకుంటే మీ సాక్షి పేపర్ ని అంకితం చేసుకోండి, భారతి సిమెంట్ ని ఆకితం చేసుకోండి లేదంటే మీరు సంపాదించుకున్న కోట్ల రూపాయలు జాతికి అంకితం చేసుకోండి. నెల్లూరు ప్రజలు ఎంతో కష్టపడి కాయ కష్టం చేసుకుంటూ పవర్ ప్లాంట్ లో చేసుకుంటుంటే వారి భూమిని లాక్కొని వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వకుండా ఈరోజు ఆ పవర్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేస్తున్నారు. మేము జనసేన పార్టీ తరఫున మొదట్లో కూడా చెప్పాము, దీనికి వ్యతిరేకమని.జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కి మాత్రం ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్పాలి అని చెప్పి తెలియజేస్తున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, నగర ప్రధాన కార్యదర్శి వరకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కలువాయి సుధీర్, ఇతర 51కమిటీ సభ్యులు పాల్గొన్నారు.