ధర్మవరం ( జనస్వరం ) : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ ముదిగుబ్బ మండలంలో పర్యటించి రైతుల కష్టాలను తెలుసుకున్నామన్నారు. గతంలో రైతులకు రాయలసీమ జిల్లాలలో వేరుశనగ కానీ ఇతర పంటలు పోయినవాళ్ళకి ఇంతవరకు గాని సబ్సిడీ ప్రకటించిన పాపాన పోలేదని అన్నారు. అలాగే గత ప్రభుత్వాలు బ్యాంకులో లోన్ తీసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాలోకి నష్టపరిహారం పడేదని కానీ ఈ ప్రభుత్వం వాలంటీర్స్ ను పేట్టి కేవలం వాళ్ల కార్యకర్తలకు మాత్రమే పంటలు పోయినట్టు రాపిచ్చుకొని కొంతమంది రైతులకు మాత్రమే ఇన్సూరెన్స్ పడేవిధంగా రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని తెలిపారు. రైతు భరోసా పేరుతో 13 వేలు అని చెప్పి కేవలం 7500 వేలు మాత్రమే అది కూడా 2 వేలు ఒకసారి 5 వేలు ఒకసారి రైతులకు బిక్షం వేసినట్టు వేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.