అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక రాజీవ్ కాలనీ పంచాయతీలోని భగత్ సింగ్ నగర్ లో మహిళలతో మాటామంతి కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా 5వ రోజు జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కోఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత పర్యటించి అక్కడ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ స్థానిక డ్వాక్రా మహిళలు మాకు సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు పడలేదని జగన్ మోహన్ రెడ్డి మమ్మల్ని నమ్మించి మోసం చేశాడని చెప్పారని అన్నారు. ఈ కాలనీలో రోడ్డుకి ఇరువైపులా సైడుకాలువలు నిర్మాణం జరగక మురుగునీరు రోడ్లమీదకు చేరి కాలనీ ప్రజలు ఇబ్దందులకు గురి ఔతున్నరని అన్నారు. జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలైన దీపం పథకం క్రింద ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని అన్నారు. తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూపాయలు 15వేలు ఆర్థిక సహాయం ఆడబిడ్డ నిధి నుంచి 18 సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు15వందల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ జనసేన టీడీపీ ఉమ్మడి కూటమిని ఆదరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com