
ముమ్మిడివరం ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో జనసేన రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్చార్జి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రజలకు ఏం మేలు చేయగలవో చెప్పుకోవడం మాని ప్రతి పక్షాలను విమర్శించే వైఖరిని జగన్ మోహన్ రెడ్డి విడనాడాలన్నారు. మత్స్యకార సదస్సులో మత్స్యకారులు నువ్వేం చేసావో.. ఏం చేస్తావో చెప్పుకోవడం మాని చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను విమర్శలు చేసిన నిన్ను త్వరలో ప్రజలు కోడిగుడ్లుతో కొట్టి తరిమి కొడతారన్నారు. దత్తపుత్రుడు అనే పదానికి అర్ధం తెలియని వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. నువ్వు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా 175లో 17సీట్లు కూడా రావు. ప్రజలు నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రాష్ట్ర పర్యటన ప్రారంభిస్తే నీ పునాదులు కదలడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమమలో జనసేన నాయకులు పాల్గొన్నారు.