కృష్ణా, (జనస్వరం) : పెరిగిన కరెంట్ ఛార్జీలు మరియు ట్రూ అప్ ఛార్జీలు పేరిట అదనంగా వసూలు చేసిన, చేస్తున్న కరెంట్ ఛార్జీల గురించి వ్యతిరేకిస్తూ కృష్ణా జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ గారు జనసేన పార్టీ తరుపున జగ్గయ్యపేట పట్టణంలో గల స్థానిక బస్ డిపో నందు గల విద్యుత్ కార్యలయంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఇంజినీర్ గారికి కి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన కష్ట కాలంలో సామాన్యులకు కరెంట్ బిల్ కట్టటం కష్టంగా ఉన్న కాలంలో నాలుగు సంవత్సరాలు ముందు వాడిన కరెంట్ యూనిట్లను రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టి ట్రూ అప్ ఛార్జీల పేరిట ప్రతీ యూనిట్ పై ఒక రూపాయి ఇరవై మూడు పైసలు అదనంగా వసూలు చేయడం అమానుషమని ఆయన తెలిపారు. ఈ రెండున్నర సంవత్సరాల జగన్ రెడ్డి గారి ప్రభుత్వ పాలనలో నాలుగు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని అదీ చాలదు అన్నట్లు ఫిక్సడ్ ఛార్జీలు, కస్టమర్ ఛార్జీలు విద్యుత్ సుంకంతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం అంతా సామాన్యులపై వేయటం సరైన నిర్ణయం కాదని తెలిపారు. నష్టాల్లో ఉన్న కరెంట్ బోర్డును సవరించాలంటే ప్రభుత్వం నుంచి రావాలిసిన బకాయిలు పెడితే సరిపోతుంది అని, సామాన్యులపై ఈ భారం మోపడం సరైన నిర్ణయం కాదని, త్వరితగతిన ఈ ఛార్జీలను నియంత్రించవలసినదిగా జనసేన పార్టీ తరుపున మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు. అదే విధంగా పట్టణంలో గల పలు వార్డుల్లో వీధి లైట్లు, ట్రాన్స్ ఫార్మర్స్ మీద కూడా సరైన దృష్టి పెట్టవలసినదిగా జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల్, రాం, హరీష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com