మదనపల్లి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత దారం మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మొదట మద్యనిషేధం, తరువాత మద్యనియంత్రణ అని బీరాలు పలుకుతున్నారు. ఇప్పుడు కల్తీ మద్యం అమ్ముతూ.. అది కూడా ప్రభుత్వ మద్యం దుకాణంలో ఈ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి జనాలకు తెలియని ఏవేవో బ్రాండ్స్ అమ్ముతున్నారు. వాటిలో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయని అందరూ చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఫలితంగా నిన్న రేపల్లెలో ఇద్దరు రక్తపు వాంతులు చేసుకొని మరణించారు. ఇది అనారోగ్యం వల్ల అని ప్రభుత్వం తరుపున అంటున్నారు, మద్యం వల్ల అని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఘోరం జరిగిపోయింది, ప్రభుత్వం మాత్రం మద్యాన్ని నిషేదిస్తామని ఇప్పుడు మద్యం మీద ఆదాయం కోసం చూడడం పౌర సమాజం ఖండించాల్సిన విషయం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, అలాగే ఇద్దరు విషమ పరిస్థితిలో ఉన్నారు .వారికి మంచి వైద్యం అందించాలని, మద్యాన్ని అందులోనూ కల్తీ మద్యాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాను అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com