
విజయవాడ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా ప్రజలతో మమోకమై, విలువలతో కూడినటువంటి జీవితం గడిపినటువంటి రామోజీ రావు గారిని కావాలనే వైసిపి ప్రభుత్వం మరియు జగన్మోహన్ రెడ్డి గారు అక్కసుతో రామోజీరావు గారిని ఇబ్బందులుకు గురిచేయాలనే ఒక దుర్మార్గపు ఆలోచనతో, కుట్రతో మార్గదర్శి మీద సిఐడి విభాగం చేత కావాలనే రైడులు చేయించి ప్రజల మధ్య ఏదో జరుగుతుందనే గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ఈనాడు పత్రిక ప్రజలను చైతన్యపరిచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే అక్రమాలను అవినీతిని, పాలనలో లోపాల్ని ప్రజలకు తెలియజేయడమే ఈనాడు పత్రిక చేసిన తప్పా అని, అవినీతి చేస్తే కళ్ళు మూసుకుని ఉండాల అని? ఇష్టానుసారం మట్టి దోచేస్తూ ఉన్నా, ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఆస్తులును ఇష్టానుసారం అమ్మేస్తూ ఉంటే చూస్తూ ఉండాలఅని, ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు చేసిన మాట వాస్తవం కాదాఅని, పోలవరం కి 10శాతం పనులు కూడా పూర్తికాక పోవడం వాస్తవం కాదాఅని, పులిచింతల డ్యాంకి ఇంతవరకు ఒక గేటు కూడా బిగించలేకపోవడం నిజం కాదాఅని, ఇలాంటి అనేక విషయాలు ప్రజలకు తెలియపరచి వాళ్ళని చైతన్య పరిచి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అక్రమాలను అవినీతిని బయటపెట్టారని రామోజీరావు గారు లాంటి వ్యక్తిని మీరు అనగదొక్కాలనే ప్రయత్నంలో మీరెప్పటికీ సఫలీకృతం కారని, ప్రజల్లో గాని కోర్టులో గాని వారికి ఎప్పటికీ కూడా మంచే జరుగుతుందని, ఈనాడు పత్రిక ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల విలువలు కోసం నిలబడిన పత్రిక అని ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారని, వైసీపీ యొక్క వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే మీరు కావాలనే ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని ఇటువంటి చర్యలు నిలుపుదల చేయకపోతే ప్రజలు మిమ్మల్ని మరింత అసహ్యించుకుంటారని రామోజీరావు గారు లాంటి మంచి వ్యక్తిని ఇబ్బందులకు గురి చేస్తే మీ పతనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టే అని హెచ్చరించారు.