గుంటూరు, (జనస్వరం) : సమస్యలు పరిష్కరించటం చేతకాక దిగజారుడు విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలు. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరినీ నమ్మించి మోసం చేసిన నమ్మకద్రోహ పుత్రులు వైసీపీ నేతలే, పవన్ కళ్యాణ్ ని విమర్శించటానికే కాపులకు మంత్రి పదవులు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో చీపుర్లతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడైతే వైసీపీ అధికారం చేపట్టిందో, ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి ఏ క్షణాన ప్రమాణస్వీకారం చేసాడో అప్పటినుంచి రాష్ట్రంలో ఏ ఒక్కరూ ప్రశాంతంగా లేరని, రాష్ట్రానికి పట్టిన అష్టదరిద్ర పుత్రుడు జగన్ రెడ్డేనని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళహరి విమర్శించారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మానాలని, వైసీపీ నేతలకు మంచిబుద్ది ప్రసాదించమని శ్రీనివాసరావుతోటలో ఉన్న స్వతంత్ర సమరయోధుడు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళహరి మాట్లాడుతూ ప్రజా సమస్యల్ని పరిష్కరించమని అడిగితే వైసీపీ నేతలకు ఎక్కడలేని కోపం వస్తుందని, తమ అసమర్థతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆర్థిక నేరాలతో జైల్లు ఉన్న జైలుపుత్రుడు, మనీ లాండరింగ్ కేసులతో సీబీఐ చుట్టూ తిరుగుతున్న సీబీఐ దత్తపుత్రుడు, తల్లిని, చెల్లిని మోసం చేసిన చెత్తపుత్రుడు, సీపీయస్ రద్దు చేస్తానని ఉద్యోగుల్ని నమ్మించి మోసం చేసిన నయవంచక పుత్రుడు, సొంత బాబాయ్ ని చంపిన వారికి అండగా నిలుస్తూ సోదరి సునీతను ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ పుత్రుడు, మాయమాటలతో అలవి కానీ హామీలతో ప్రజల్ని మోసం చేసిన మాయల మరాఠీ పుత్రుడు జగన్ రెడ్డేనని ధ్వజమెత్తారు. మరోవైపు తమ శాఖలపై ఏమాత్రం పట్టు సాధించలేని స్థితిలో మంత్రులున్నారన్నారని విమర్శించారు. సంచలనం సృష్టించిన విజయవాడ ప్రభుత్వాసుపత్రి గ్యాంగ్ రేవ్ సంఘటనలో రాష్ట్ర హోంమంత్రి డొల్లతనం బయటపడిందని, మరోవైపు గోదావరిపై పులిచింతల ప్రాజెక్ట్ కడుతున్నామంటూ నోటిపారుదల 2.0 శాఖామంత్రి అంబటి వ్యాఖ్యానించటం మంత్రులు తమ శాఖలపై నర్సరీ స్థాయిలోనే ఉండటాన్ని సూచిస్తున్నారు. క్యాబినెట్ లో కాపులకు మంత్రి పదవులు ఇచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ ని తిట్టేందుకు మాత్రమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ పై కాపు మంత్రులు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ నలుగురు పెళ్లాల ముద్దుల మొగుడు అంటూ పవన్ కళ్యాణ్ ని విమర్శించడం హేయమని అతని స్థాయికి తగదన్నారు. చట్టప్రకారం ఇద్దరికి విడాకులు ఇచ్చి వారికి రావాల్సిన భరణం చెల్లించాక మాత్రమే మరో పెళ్లి చేసుకున్నారని, మరి నాలుగో భార్య ఎక్కడినుంచి వచ్చిందో అమర్నాధ్ చెప్పాలని, ఒకవేళ అమర్నాథ్ చెల్లినో, అక్కనో, కుటుంబ సభ్యుల్లో ఎవరినన్నా చేసుకుంటే ఆ వివరాలు బయట పెట్టాలని కోరారు. పవన్ కళ్యాణ్ 151 వైసీపీ అసమర్ధ శాననసభ్యులకు మొగుడేనన్న విషయం అందరికి తెలిసిందేనన్నారు. వచ్చేనెలలో గడప గడపకు వైసీపీ అంటూ ప్రభుత్వం ప్రారంభించే కార్యక్రమం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, చీపురు, పప్పుగుత్తులు సిద్ధం చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజలిచ్చిన అధికారాన్ని సార్ధకం చేసుకోవాలని హితవు పలికారు. ప్రజలు మార్చు కోరుకుంటున్నారని, జనసేనకు రోజురోజుకీ ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తుందని ఆళ్ళ హరి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొర్రపాటి నాగేశ్వరరావు, చెన్నాపోతురాజు, పకృద్దీన్, బండారు రవీంద్ర, శేషు, దాసరి రాము, స్వామి, బాషా, రమేష్, సుబ్బారావు, కోటేశ్వరరావు, దుర్గ, తేజ తదితరులు పాల్గొన్నారు.