విశాఖపట్నం ( జనస్వరం ) : ‘అసమర్ధ వైసీపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రజలు ఈవీఎం బటన్ నొక్కి ఇంటికి పంపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పదవి పోతుందని, జైలు గోడల మధ్యనే జీవితం ఉండబోతోందని తెలిసి నోటికి ఏదొస్తే అది జగన్ మాట్లాడుతున్నార’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కోన తాతారావు అన్నారు. సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ ‘‘ఓటమి భయంతో ఫ్రస్ట్రేషన్ లో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై ముఖ్యమంత్రి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. తోలుబొమ్మలాటలో కేతిగాడికీ, సర్కస్ లో బఫూన్ కీ ఎంత విలువ ఉందో జగన్ రెడ్డి మాటలకీ, హావభావాలకీ అంతే విలువ ఉందని ప్రజలు భావిస్తున్నారు. పాలన చేయమని మెజారిటీ ఇస్తే ఏం చేయాలో తెలియక శ్రీ పవన్ కల్యాణ్ గారి మీద అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజల గురించి ఆలోచించాల్సిన వ్యక్తి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రతిపక్షాల గురించి విమర్శలు చేయడం అంటే పాలన గాలికి వదిలేశాను అని చెప్పడమే. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకీ, కాజ దగ్గర పవన్ కల్యాణ్ గారు కొనుగోలు చేసిన భూమికీ లింక్ పెట్టి పిచ్చి రాతలు రాస్తూ జగన్ పత్రిక, ఛానెల్ శునకానందం పొందుతున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు అనే దానికి నోటిఫికేషన్ లేదు. ప్రకటన కూడా లేని ఇన్నర్ రింగ్ రోడ్డుకీ, పవన్ కల్యాణ్ గారి స్థలానికీ ఏమైనా సంబంధం ఉందా? అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకోవడం తప్పా? జగన్ రెడ్డిలా ప్రతి మెట్రో సిటీలో ఒక ప్యాలెస్ కట్టుకోవడం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. సూట్ కేసు కంపెనీలతో డబ్బు కొల్లగొట్టడం పవన్ కళ్యాణ్ గారికి చేతకాదు. తమ ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం రింగు రోడ్డులను అష్ట వంకర్లు తిప్పడానికి అలవాటుపడ్డ వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ రెడ్డి, ఆయన తండ్రి మహా మేత మాత్రమే. పవన్ కల్యాణ్ గారు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే చేతనైన సాయం చేసి భుజం కాసే వ్యక్తి. వైసీపీ పాలనలో 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పరామర్శించిన దాఖలాలు వైసీపీ నాయకుడికి లేవు. ఇడుపులపాయ నేల మాలిగల నుంచి తీసి, కనీసం రైతు కుటుంబాలకు ఒక్క పైసా అయినా ఇచ్చారా? సొంత డబ్బు సరే. ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా ఆపేసిన నిరంకుశుడు జగన్ రెడ్డి. అమరావతి రాజధానిని నాశనం చేయడంలో జగన్ కుట్రపూరితంగా వ్యవహరించి హైదరాబాద్ లో తన ఆస్తుల విలువ పెంచుకున్నారు. జగన్ కి హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల మీద ఉన్న ప్రేమతో అమరావతిని చంపే కుట్ర చేస్తున్నారు. తండ్రి పాలన అడ్డుపెట్టుకొని కార్పొరేట్ మాఫియా నడిపిన వ్యక్తి జగన్ రెడ్డి. క్విడ్ ప్రో కో అలవాటు చేసుకున్న వ్యక్తులకు ప్యాకేజీల గురించి బాగా తెలుసు. దీనిలో జగన్ రెడ్డిది ఆరితేరిన చేయి. పారిశ్రామికవేత్తలను భయపెట్టి సాక్షిలో పెట్టుబడులు పెట్టించుకున్నది నిజం కాదా? ఇప్పటికీ సీబీఐ కోర్టులో కేసులు నడుస్తున్నది నిజం కాదా..? ఛార్జ్ షీట్ సీఎంగా పేరున్న జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొంటే మంచిది. ఏకపాత్రాభినయం చేస్తూ ఎంత గొంతు చించుకున్నా జగన్ రెడ్డిలోని అపరిచితుడిని ప్రజలు మర్చిపోరు” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ భీమిలి నియోజకవర్గ ఇంఛార్జి పంచకర్ల సందీప్, విశాఖపట్నం నార్త్ నియోజకవర్గ ఇంఛార్జి పసుపులేటి ఉషాకిరణ్, విశాఖ నగరపాలక సంస్థ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, పార్టీ నాయకుడు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.