Logo
Date of Publish : 27 June 2023, 4:54 pm
Editor : Sake Naresh

ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న జగన్ రెడ్డి

      విజయనగరం ( జనస్వరం ) : జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని  జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు అన్నారు. ఆయన మాట్లాడుతూ  కేవలం అమ్మ ఒడి పథకం బటన్ నొక్కడం కోసం సుమారు 2 నుంచి 3 కోట్లు ప్రజా ధనాన్ని ఖర్చు పెడుతూ కురుపాం నియోజవర్గాన్ని ఎంచుకోవడం హాస్యాస్పదం. ఈ డబ్బుతో కొన్ని గ్రామాలకు తాగునీరు అందించొచ్చు, గిరిజన వసతుల్లో మౌలిక సదుపాయాలు కల్పించొచ్చు. అసలేం ప్రగతి సాధించారని పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గంలోకి వస్తున్నారు? గిరిజన ప్రాంత అభివృద్ధికి ఏం చేసారో స్పష్టత లేదు. పూర్ణపాడు లాభేసు వంతెన నిర్మాణం ఎందుకు పూర్తి చెయ్యలేకపోయారో చెప్పాలన్నారు. విద్య,వైద్యం, వ్యవసాయం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై వెనుకబడిన కురుపాం నియోజకవర్గానికి ఈ నాలుగేళ్లలో ఏం చేసారో చెప్పాలని జగన్ కు ప్రశ్నల వర్షం గుప్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com