Logo
Date of Publish : 27 June 2023, 5:07 pm
Editor : Sake Naresh

సంక్షేమ పథకాలు పేరు చెప్పి ప్రజలను సోమరపోతులను చేస్తున్న జగన్ రెడ్డి

        శృంగవరపుకోట ( జనస్వరం ) : ఈ సమావేశం ఉద్దేశించి జనసేన నేత వబ్బిన సన్యాసి నాయుడు ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు పేరు చెప్పి ప్రజలను సోమరపోతులను చేస్తున్నారని శృంగవరపుకోట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఒబ్బిన సన్యాసినాయుడు మండిపడ్డారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన ఎస్ కోటలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పేర్లు చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ, అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా, ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా తాకట్టు పెట్టే పరిస్థితికి దిగజారారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకులు, విద్యుత్తు, రవాణా చార్జీలను అమాంతంగా పెంచి పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజల జీవన ప్రమాణ స్థాయి కుంటుపడేలా చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ, ప్రభుత్వ భూముల దోపిడీ వంటి రకరకాల దోపిడీలను చేస్తూ, ప్రజలకు మసి పూసి మారేడు కాయను చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైసిపి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని అప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు అఖిలపక్షంతో కలిసి జూన్ 30వ తేదీన కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయన తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com