Logo
Date of Publish : 22 June 2022, 4:56 pm
Editor : Sake Naresh

లక్షమందికి పైగా అమ్మ ఒడి లబ్ధిదారులను అనర్హులుగా తేల్చిన జగన్ రెడ్డి : యం.ధనుంజయ

          పామిడి ( జనస్వరం ) : అమ్మ ఒడి పథకాన్ని కొనసాగించడం చేతకాక, నిధులు లేక అప్పులు దొరకక అమ్మఒడి పథకానికి మంగళం పాడేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం నిబంధనల పేరుతో అర్హులైన వారిని కూడా అనర్హులుగా ప్రకటిస్తున్నారని పామిడి మండల అధ్యక్షుడు యం.ధనుంజయ పత్రికాముఖంగా ఆరోపించారు. విద్యుత్తు వాడకం నెలకు 300యూనిట్లు దాటితే అమ్మఒడి పథకం అందదని అన్నారు. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విద్యార్థి హాజరు 75శాతం లేకపోయినా అమ్మఒడి ప్రయోజనం పొందలేరు. బియ్యం కార్డు కొత్తది ఉండాలి. బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు చేసుకోవడం, బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయో లేవో విద్యార్థుల తల్లిదండ్రులు తనిఖీ చేసుకోవాలి అంటూ తల్లిడదండ్రులను ముప్పతిప్పలు పెట్టారన్నారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలను ఇటీవల పాఠశాల విద్యాశాఖ జారీ చేసిందని ఈ నిబంధనల ప్రకారం ఏపీ వ్యాప్తంగా లక్షమందికి పైగా విద్యార్థులు అమ్మఒడి పథకానికి అనర్హులయ్యారని అన్నారు. జగన్ రెడ్డి గారి చేతగాని పరిపాలన వల్ల ప్రజలు వంచనకు గురవుతున్నారని ఇలాంటి చెత్త పరిపాలనకు ప్రజలు కూడా మంగళం పాడే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com