Logo
Date of Publish : 25 January 2024, 6:59 pm
Editor : Sake Naresh

ముస్లిం మైనార్టీలకు అపద్దపు హామీలను చెప్పి నిలువునా మోసగించిన జగన్ రెడ్డి

   అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా 14వ రోజు అనంతపురం రూరల్ మండలంలోని చంద్రబాబు నగర్ లో మహిళలతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించి స్థానిక ముస్లిం మతపెద్ద మహబూబ్ ఖాన్ ఆహ్వానం మేరకు మాబుసుబాని దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి చేసిన మోసాల గురించి మాట్లాడారు. అపద్దపు హామీలు ఇచ్చి మోసగించాడని ఒక్క ఛాన్స్ అంటూ ముస్లింలపై ప్రత్యేక అభిమానం ఉన్నట్లు నటించి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం చేశారని అన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం గత ప్రభుత్వ అమలు చేసిన పథకాలన్నింటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని దుల్హన్ పథకంతో మొదలుకొని రంజాన్ తోఫా, విదేశీ విద్య, తత్కాల్, దుకాణ్ మకాన్, ఇస్లామిక్ బ్యాంకు పథకాలకు వైసీపీ మంగళం పాడిందని అన్నారు. ఇమామ్ మౌజాన్లకు అందజేసే గౌరవ వేతనం 15వేల రూపాయలు గృహాల మంజూరు మసీదుల మరమ్మతులకు నిధులు కేటాయించలేదని, ప్రతి నియోజకవర్గానికి షాదీ ఖానా హామీ మరిచారని హాజ్ యాత్రకు ఆర్థిక సహాయం కరువైందని అన్నారు. ముస్లింలకు సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయని చెప్పిన పథకాలు ఏమి అమలు చేయక జగన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతూ ముస్లింలను మోసం చేశాడని అంటూ.. ఈసారి కచ్చితంగా ముస్లిం మైనారిటీలు జనసేన టీడీపీ పార్టీలకు ఓటు వేయాలని కోరారు. తప్పకుండా మీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి స్థానిక డివిజన్ నాయకులు చాంద్, మన్సూర్ గౌస్ మొహిద్దిన్, వీర మహిళలు లక్ష్మి, చంద్రకళ, సరోజమ్మ, గాయత్రి, సురేఖ, సానియా తదితరులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com