Search
Close this search box.
Search
Close this search box.

జగన్ మోహన్ రెడ్డి పాలన దుర్భిక్షం – పవన్‌ కళ్యాణ్‌ని అడ్డుకోవడం మీ తరం కాదు : జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ జయరామిరెడ్డి

జగన్ మోహన్ రెడ్డి

     అనంతపురం, (జనస్వరం) : ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం దుర్భిక్షం తో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని.. ప్రజాసంక్షేమం అభివృద్ధి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి లేని ఈ ప్రభుత్వ పెద్దల అనాలోచిత నిర్ణయాలకు ప్రజలు మూల్యం చెల్లించకునే దుస్థితి దాపరించిందని జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్‌ కుంటిమద్ది జయరామిరెడ్డి  అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవన్‌ కళ్యాణ్‌ మీద కోపం ఉంటే ఆయన _ సినిమాల్ని అడ్డుకుంటే ఏమవుతుందో బాగా తెలిసిన ఈ ప్రభుత్వానికి పరోక్షంగా దెబ్బతీసేందుకు ఏకంగా ఫిలిం ఇండస్ట్రీనే టార్గెట్‌ చేయాలన్న దుర్చుద్ధి పుట్టిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సినిమాల పైన నియంత్రణ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అని ప్రశ్నిం చారు. ఈ ప్రభుత్వం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం ఇప్పటికే అభాసు పాలైందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సక్రమ మార్గంలో నడవాలని జయరాంరెడ్డి ఈ ప్రభుత్వానికి హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way