నెల్లిమర్ల ( జనస్వరం ) : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరంలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు లోకం మాధవి గారిని ముందస్తు చర్యగా వారి స్వగృహం వద్ద పోలీసులు గృహ నిర్బధం చేసినారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రశ్నించే వారినీ నిలువరించే విధంగా చేయడం ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీలు తప్ప అమలుకు నోచుకోలేకుండా ఎక్కడ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తారో అని భయంతో అక్రమ అరెస్టులు చేయడం జగన్ మోహన్ రెడ్డి పాలనకే సిగ్గు చేటు. తెల్లవారుజామున నుంచే ఇంటి చుట్టూ పక్కల పోలీసులు పహారా కాస్తూ ఇలా గృహ నిర్బంధం చేయటం చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యనికే నిర్బందన అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com