బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్ ఓట్ సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తున్న వారికి పర్మిట్ చేస్తానని ఇంతవరకు కూడా చేయలేదు. ఆ ఉద్యోగాలు చేస్తున్న వారి ఇంటిలో గ్రామస్థాయిలో 10.000 జీతము. పట్టణ పరిధిలోని 12,000 జీతాలు తీసుకుంటున్న వారి కుటుంబాలలో దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఈ నెలలో 95 వేల మంది పెన్షన్ లు తీసి వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే కాంట్రాక్ట్ ఓట్ సోర్ర్సింగ్ ఉద్యోగస్తులను పర్మినెంట్ చేయాలి వారి ఒక కుటుంబంలో దివ్యాంగులు, వృద్ధుల, వితంతువులు, తీసివేసిన పెన్షన్ వెంటనే ఇవ్వాలని జనసేనపార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు డిమాండ్ చేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, గంట నాగమల్లేశ్వర రావు, షేక్ సుభాని, దేవి రెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.