Logo
Date of Publish : 13 July 2023, 2:45 pm
Editor : Sake Naresh

10 తలల ఆకారంతో జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం.

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలు దగ్ధం చెయ్యడాన్ని నిరసిస్తూ ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారు శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద జగన్ రెడ్డి గారి దిష్టి బొమ్మను తగ్ధం చెయ్యడానికి వెళ్తుండగా పోలీస్ లు ప్రివెంటివ్ అరెస్టు పేరుతో హౌస్ అరెస్టు చెయ్యడం జరిగింది. నిన్న పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మను దగ్ధం చెయ్యడానికి అనుమతించిన పోలీసులు జనసేన కార్యక్రమానికి ఆటంకాలు పెట్టడం, అడ్డుకోవడం ప్రజాస్వామ్యంలో పోలీసులు ప్రతిపక్ష పార్టీల నిరసన తెలిపే హక్కులను కాలరాయమే. శాంతియుతంగా రాజ్యాంగ బద్దంగా నిరసన తెలపడం పోలీసులు అడ్డుకోవడం హేయమైన చర్య. స్థానిక ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి బర్త్ డే పార్టీ చేసుకోవడానికి ఇచ్చిన పెర్మిషన్ జన సేన పార్టీ నిరసన తెలపడానికి ఎందుకు ఇవ్వరు. వినుత గారి ఇంటి కాంపౌండ్ లోపలకి పోలీసులు బలవంతంగా వచ్చి పార్టీ కార్యకర్తల ఆధార్కార్డు లు చూపాలని అడగడం వింత పోకడ. పోలీసులు హౌజ్ అరెస్టు చేయడంతో వినుత గారి ఇంటి వద్ద జగన్ రెడ్డి 10 తలలతో రావణాసురుడి ఆకారంలో చేసి దిష్టి బొమ్మను దగ్ధం చెయ్యడం జరిగింది. శ్రీకాళహస్తి పట్టణం లోని పెళ్ళిమండపం వద్దకు నిరసన చెయ్యడానికి చేరుకున్న కొంత పార్టీ నాయకులు కొట్టే సాయి ప్రసాద్ గారిని , జనసైనికులను అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడానికి వినుత గారు తీవ్రంగా ఖండించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com