Logo
Date of Publish : 21 July 2023, 10:57 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ దెబ్బకు జగన్ చెత్త చెత్తగా మాట్లాడుతున్నారు

    ఆత్మకూరు ( జనస్వరం ) : వెంకటగిరిలో నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై దిగజారుడు వ్యాఖ్యలు చేయడాన్ని, ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ తీవ్రంగా ఖండించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం లేకపోవడం వల్లే జగన్ చెత్త చెత్తగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలను ఆత్మకూరు జనసేన పార్టీ తరఫున మేము అడుగుతున్నాము. దమ్ముంటే సమాధానం చెప్పగలరా?
(1) వాలంటీర్లు సేకరిస్తున్న సమాచారం అంతా హైదరాబాద్ నానక్ రామ్ గూడ లోని ఎఫ్.ఓ.ఏ అనే కంపెనీలో ఎందుకు ఉంది? ఆ కంపెనీ ఎవరిది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం జగన్ రెడ్డికి ఉన్నాయా?
(2) వాలంటీర్లలో కొంతమంది మహిళలు, మైనర్ బాలికలపై అత్యాచారాలు చేయడం, వేధింపులకు గురిచేయడం, వివాహితుల కాపురాలు కూల్చడం నిజం కాదా? వీరి వేధింపులకు అత్యాచారాలకు ఎవరు బాధ్యత వహిస్తారో జగన్ రెడ్డి చెప్పగలరా?
(3) వాలంటీర్లు ద్వారా సేకరిస్తున్న డేటా దుర్వినియోగం అవుతుంటే ఏ అధికారి? ఏ మంత్రి? భాద్యత తీసుకుంటారు.
(4) ప్రతి వ్యక్తి ఆధార్, బ్యాంక్ వివరాలు నుంచి సోషల్ మీడియా అకౌంట్ వివరాలు ఎవరు ఎక్కడికి, ఎప్పుడు ఏ పని మీద వెళ్తున్నారు, ఒంటరి మహిళలు, యువతుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు సేకరిస్తున్న మాట నిజం కాదా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా?
(5) మహిళలు, యువతుల వివరాలు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారో చెప్పగలరా?
(6) వాలంటీర్లకు ఐడి కార్డులు కూడా లేవు అనేది వాస్తవం కాదా?
(7) రాష్ట్రంలో మహిళలు అదృశ్యం అవుతున్న,సీరియస్ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఈ విషయాన్ని మరుగున పెట్టేందుకే చెత్త మాటలు మాట్లాడుతున్నారు.
(8) ప్రశ్నిస్తే వ్యక్తిగత జీవితం గురించి అవాకులు, చవాకులు పేలుతున్న జగన్ గురించి, మేము మా జనసేన పార్టీ తరఫున మాట్లాడగలం.
(9)తండ్రి చనిపోయినప్పుడు జగన్ ఎక్కడ, ఎవరి దగ్గర ఉన్నాడు? కలకత్తాలో ఉన్న మాట వాస్తవమా.. కాదా? అప్పుడు ఆయన ఎవరితో ఏ టైప్ మీటింగ్ లో ఉన్నాడు.
(10) బెంగళూరు ప్యాలెస్ లో చేసిన అరాచకాలు చిట్టా అందరికీ తెలుసు.
(11) అక్కడి రాసలీల గురించి, వైసిపి మంత్రుల గంట,అరగంట వ్యవహారాలు, ఇటువంటి అరాచకాలు బయటకు వస్తాయని ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఆ రాష్ట్ర కీలక కాంగ్రెస్ నాయకుడికి ఎన్నికలకు, ఎన్ని వందల కోట్లు పంపించారు. ఆ డబ్బులు తీసుకెళ్లే బాధ్యతను, ఏ ఉన్నతాధికారికి అప్పగించారో త్వరలో బయటపెడతాం.
(12) మీ ఇళ్లలో ఉన్న వారి అక్రమ సంబంధాలు, వాటి నేపథ్యంలో నేరాలు కూడా కడప జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు.
(13)తల్లిని,చెల్లిని బయటికి గెంటేసిన వ్యక్తి కూడా నీతులు చెబుతున్నాడు.
(14) జగన్... నీ లాగా మేము కూడా దిగజారి నీచంగా మాట్లాడగలము. కానీ మాకు సంస్కారం ఉంది అందుకే హద్దుల్లో ఉండి మాట్లాడుతున్నాం.
నీ ఓటమి, నీ కళ్ళ ముందు కనిపిస్తోంది. అందుకే సంధి ప్రేలాపనలు పేలుతున్నావు అని, నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com