తిరుపతి ( జనస్వరం ) : జగన్ దగ్గర అవినీతితో దోచుకున్న ధనం ఉంది కానీ... ఓట్లేయడానికి జనం లేరన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. బుధవారం పలమనేరులో జరిగిన టిడిపి-జనసేన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పోలీసు వ్యవస్ధను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా పనిచేయాల్సిన వ్యవస్ధలను వైసీపీ నాయకులు తమ సొంతానికి వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐపీసీ కోడ్ ను అమలు చేయాల్సిన పోలీసులు వైసీపీ కోడ్ ను అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కార్యకర్తలు యుద్దం చేయడానికి సిద్దంగా ఉండాలన్నారు. చంద్రబాబు చేయని తప్పుకు తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బకాసురుడికైనా కడుపు నిండుతుంది కానీ అవినీతిని దోచుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కు కడుపు నిండటం లేదన్నారు. ల్యాండ్, శాండ్, బ్రాండ్ అంటూ దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ఆశయంతో రాజకీయాలు చేస్తుంటే... చంద్రబాబు అభివ్రుద్ది కోసం రాజకీయాలు చేశారన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు.
ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందున్నానంటూ పవన్ కళ్యాణ్ ఆశయంతో పనిచేస్తున్నారన్నారు. అనేక కంపెనీలను, కేంద్ర ప్రభుత్వ సంస్ధలను రాష్ట్రానికి రప్పించి చంద్రబాబు అభివ్రుద్ది చేశారన్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం దోచుకోవడంపై శ్రద్ద పెట్టారని ఎద్దేవా చేశారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. టిడిపి-జనసేనలను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని ఆయన జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి పసుపులేటి దిలీప్ , రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిని అధికార ప్రతినిధి కీర్తన , జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్ కార్యదర్శులు కలప రవి , ఆనంద్ , రాజంపేట నాయకులు దినేష్ మరియు తిరుపతి ఉపాధ్యక్షులు పార్ధు , పలమనేరు మండల అధ్యక్షులు హరీష్ , నాగరాజు , చందు, శివ ,బాబు చైతన్య, కాపు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు గోపి రాయల్ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com