నెల్లూరు ( జనస్వరం ) : భయపడిన వైసిపి నాయకులారా డైపర్లు తొడుక్కోండి అంటూ జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గాంధీ బొమ్మ వద్ద పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి భేటిని విమర్శిస్తున్న వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలను ఖండిస్తూ విన్నూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరు ఎక్కువ తిడితే వాళ్లకి ఎక్కువ మొత్తం అప్పజెప్తారు… జగన్మోహన్ రెడ్డి అందరికీ తిట్టమని ఎవరేమి అడిగినా తిట్టమని నేర్పిస్తున్నారు. కలెక్టర్లకు సైతం తిట్లు దండకం నేర్పించి పంపే పరిస్థితి ఏర్పడిందన్నారు. వైసీపీకి చమర గీతం పాడే రోజు త్వరలో ఉన్నాయి కేవలం పలకరిస్తేనే ఒక్కొక్కరికి కారిపోతుంది. పొత్తులో ఉన్నాయా లేదా అనేది మీకు అనవసరం పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో రాజకీయంగా అతను సంచలనం సృష్టించబోతున్నారు. ప్రజలను అష్ట కష్టాలు గురి చేస్తున్న మీకు సుపరిపాలన ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించునన్నారు అనేది మాట వాస్తవం. పదవుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది లేకపోతే రానున్న రోజుల్లో దీనికి తగిన తగిన మూల్యం చెల్లించాల్సివస్తుంది. అధికారం మదంతో రగిలిపోతున్న ఊరు కుక్కల అరుపులతో రాష్ట్రమంతా గోలగోలగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఎలా చేస్తారు? ఎప్పుడు చేస్తారు ఎట్టా చేస్తారు అని తప్పిస్తే వైసిపి మంత్రులకు వైసీపీ నాయకులకు వేరే పని లేదు. పవన్ కళ్యాణ్ గారుచంద్రబాబును ఎలా కలిశారు ఎప్పుడు కలిశారు ఎక్కడ కలిశారో ఏమనుకుంటున్నారు ఏమనుకుంటున్నారు అసలు మీరేమనుకుంటున్నారు రా కలిస్తే ఓడిపోతాం అనుకుంటున్నారా అది చెప్పండి ఒక్కొక్కడికి చెడ్డీలు తడిసిపోతున్నాయి అందరూ కలిసి డైపర్లు కొనిస్తామని హేళన చేసినా కూడా మీకు సిగ్గు రాదని అన్నారు. విలువైన అధికారం కలిగిన మీ సమయాన్ని వ్యక్తిగత ప్రతిపక్షాల పార్టీల దూషణలతో పబ్బం గడుపుతున్నారు. జబర్దస్త్ రోజా ఆంబోతు రాంబాబు రోగ్ రమేష్ గుడిసెట్టి అమర్నాథ్ ఇలా అనేకమంది ఎవరేం చేస్తున్నారు? అనే మొరుగుతారు తప్పితే పదవులు అధిరోహించిన మీరు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయాం..? స్కూల్లోకి కాలేజీలకి కాకుండా నేరుగా బీసీలకు ఖాతాలో వేస్తున్న స్కాలర్షిప్లు ఎందుకు వేయలేకపోతున్నామో…? యువతకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వ లేకపోతున్నామో..? గవర్నమెంట్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు ఎందుకులేక పోతున్నాము..? కొత్త కంపెనీలు రాష్ట్రానికి ఎందుకు రాలేకపోతున్నాయో….? ఆలోచించండి. ప్రతిపక్షాలకు ప్రజలు ఎక్కడ దగ్గరవుతారో అని కొత్త జీవోలు ప్రవేశపెట్టి సైకో పాలనను తలపిస్తున్నారు అని తెలిపారు.. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి, నిర్మల, హరి, ప్రశాంత్ గౌడ్, కంథర్ భాషా, చిన్నరాజా, షాజహన్, వినోద్, బాలు, ప్రతాప్, శ్రీకాంత్ తదితరుల పాల్గొన్నారు.