భట్టిప్రోలు ( జనస్వరం ) : అంగన్వాడీ వర్కర్ల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ విమర్శించారు. అంగన్వాడీలు చేపట్టిన నిరసన కార్యక్రమానికి అనురాధ తమ మద్దతు ప్రకటించారు దీక్షా శిబిరాన్ని సందర్శించి అంగన్వాడీల న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలు అవలంబిస్తుందన్నారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని విడనాడి అంగన్వాడి వర్కర్ల సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com