తాడేపల్లిగూడెం, ఏప్రిల్ 07 (జనస్వరం) : తాడేపల్లిగూడెం నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నా ఎస్సీలు, నా బీసీలు అంటూనే వారి సప్లై నిధులను మొత్తం దండుకుని వారిని వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తాడేపల్లిగూడెం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని జనసేన కార్యాలయం వద్ద బొలిశెట్టి సమక్షంలో రాకూరి గణేష్, తాడేపల్లి కిషోర్ల ఆధ్వర్యంలో ఎస్సీ యువకులు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ వైసిపి పాలనలో ఎస్సీలను నిలువునా మోసం చేశాడని ఆయన పాలనపై ప్రశ్నించిన వారిని చంపేందుకు కూడా వెనకాడ లేదన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు మానసిక ఒత్తిడి చేసి చంపిన వైసిపి వాళ్లు కాదా ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని శిక్షించకుండగా పార్టీలోనే ఉంచడం జగన్మోహన్ రెడ్డి నైజం సుకాలి ప్రీతి తల్లి ఆవేదనని పట్టించుకోని ప్రభుత్వం ఈరోజు దళితుల పార్టీ అని చెప్పుకోవడం శోధినీయం జనసేన పై ఉన్న అభిమానం, తనపై ఉన్న నమ్మకంతో జనసేన పార్టీలో చేరుతున్న ప్రతి ఎస్సీ ఎస్టీ సోదరులకి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. తాను అధికారంలో లేకపోయినా ఈ ఐదేళ్లు అవసరమైన వారికి తోడుగా నిలిచానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com