Search
Close this search box.
Search
Close this search box.

జగన్ తనలోని ఫ్యాక్షనిస్టుని నిద్ర లేపారు : ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

● రాజకీయంగా ఎదుర్కొలేకే పవన్ కళ్యాణ్ పై దాడులు
●విశాఖలో ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు హైదరాబాద్ లో రెక్కీ పెట్టారు
● రెక్కీ వెనుక కడప కుట్ర ఉంది
●పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే లక్షలాది జనసైనికులను దాటాలి
● హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్

       హైదరాబాద్, (జనస్వరం) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఆయన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక వైసీపీ నాయకులు భౌతిక దాడులకు ప్రయత్నిస్తున్నారని జనసేనపార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జి షేక్ రియాజ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో విద్యుత్ తీసేసి కిరాయి గుండాలతో దాడి చేయాలని చూశారు. పోలీసుల సహయంతో ప్రజలను కలవకుండా నిర్భందించాలని చూశారు. అవన్ని విఫలమవ్వడంతో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద, కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించి దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహించారు. గురువారం హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేక్ రియాజ్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ని చూసి ఈ ప్రభుత్వం భయపడుతోంది. విశాఖపట్నంలో ప్రభుత్వం కుట్రలు పన్ని ఇబ్బందిపెట్టే విధంగా ప్రవర్తించింది. ఇప్పుడు హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ ని అనుమానాస్పద వ్యక్తులు వెంబడించడం, ఆయన ఇంటి ముందు అర్థరాత్రి తాగి గొడవ చేయటం వెనక ఎవరున్నారు?

● ప్రభుత్వ చెత్త పాలన బయటకొస్తుందనే జనవాణిని అడ్డుకున్నారు :
       జనవాణి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ చెత్త పాలన బయటకు వస్తుంటే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. పాలనలో లోపాలను ప్రజలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొస్తుంటే తట్టుకోలేక జగన్ తనలోని ఫ్యాక్షనిస్టుని నిద్ర లేపారు. ప్రభుత్వ స్కీమ్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నిజమైన పేదలకి స్కీమ్స్ దక్కడం లేదు. రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, మహిళలు, విద్యార్థులు ఇలా ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు. ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తున్నారనే పవన్ కళ్యాణ్ పై దాడులకు ప్రేరేపిస్తున్నారు. దీని వెనక కడప కుట్ర ఉంది. భౌతిక దాడుల నుంచి ఎంతకైనా తెగించే హింసా రాజకీయాలలో వైసీపీ నేతలు ఎక్స్ పర్ట్స్. వాళ్ల అధినేత చరిత్ర ఎలాంటిది, అతని విధానం ఏమిటో అందరికీ తెలుసు. ఎన్ని ఎక్కువ బూతులు తిడితే వాళ్లకు మంత్రి పదవులు, దాడులకు పాల్పడ్డ వారికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇస్తామన్నట్లు ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటు.

● రక్షణ కల్పించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం :
      పవన్ కళ్యాణ్ అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు. ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అలాంటి వ్యక్తిపైనే రెక్కీ నిర్వహించారంటేనే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య పరిరక్షణే జనసేన ధ్యేయం అని పవన్ కళ్యాణ్ ప్రకటిస్తే వైసీపీ నాయకుల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశారు? ప్రజల తరఫున నిలబడటమే ఆయన చేసిన తప్పా? దీనికి వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. గుండాలు, రౌడీలు రాజ్యమేలుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలి. పవన్ కళ్యాణ్ కి రక్షణ కల్పించాలి. లేనిపక్షంలో ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ రోడ్డు మీదకు వచ్చి కర్రలు పట్టుకొని పవన్ కళ్యాణ్ కి రక్షణగా నిలబడతారు.

● వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశే జనసేన లక్ష్యం :
        పవన్ కళ్యాణ్ ని బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు. మీరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని ఎదురొడ్డి నిలబడే వ్యక్తి. తెల్లదొరలను తరిమికొట్టడానికి ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, మన్యం వీరుడు అల్లూరి ఎలాగైతే కంకణం కట్టుకొని పోరాటం చేశారో… వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకొని పోరాటం చేస్తున్నారు. రాష్ట్రం నుంచి గుండాలు, రౌడీలను తరిమికొట్టే వరకు ఆయన పోరాటం ఆగదు. పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం లేదని చెప్పిన వ్యక్తి కోసం పోలీసులు పనిచేస్తున్నారు. పోలీసు అధికారులకు మేము ఒకటే చెబుతున్నాం… ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. ప్రజల తరఫున, న్యాయం తరఫున నిలబడండి. పోలీస్ వ్యవస్థపై మా నాయకుడుకి, మాకు చాలా నమ్మకం ఉంది. దానిని నిలబెట్టేలా పనిచేయండి. పవన్ కళ్యాణ్ పై దాడి చేయాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల అవివేకం. పవన్ కళ్యాణ్ ని టచ్ చేయాలంటే ముందు రాష్ట్రంలోని లక్షలాది మంది జనసైనికులను దాటుకొని వెళ్లాలని” హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way