Logo
Date of Publish : 27 January 2024, 10:21 pm
Editor : Sake Naresh

జగన్.. సిద్దమా? యుద్దానికి…టిడిపి రా.. కదలిరా సభలో హరిప్రసాద్

   తిరుపతి ( జనస్వరం ) : జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్దమంటూ హోర్డింగ్ లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. శనివారం పీలేరులో జరిగిన టిడిపి "రా.. కదిలిరా" కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను గెలిపించాలనే జనసేన, టిడిపి కలిశాయన్నారు‌. కలయిక రెండు పార్టీల కోసం కాదని, రాష్ట్ర ప్రజల కోసమన్నారు. అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వెలుగులు నింపడానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నడుం బిగించారన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ పోరాడారన్నారు. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆశయం, అభివృద్ది కలిగిన పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది చెందుతుందన్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ల్యాండ్, శ్యాండ్, బ్రాండ్ ల పేరు చెప్పి దోచుకుంటున్నారని తెలిపారు. తల్లిని, చెల్లిని చూడని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా పరిపాలిస్తాడని ఎద్దేవా చేశారు. జగన్ వదిలిన బాణం ఆయన్నే ఎక్కుపెట్టిందని చలోక్తులు విసిరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com