
మదనపల్లె, (జనస్వరం) : మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె జిల్లా సాధన JAC ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మదనపల్లి బెంగళూరు బస్టాండ్ నుండి మదనపల్లి మున్సిపాలిటీ, సబ్ కలెక్టర్ కార్యాలయం దాకా 130 అడుగుల పొడవు గల బ్యానర్ తో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు శేఖర్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, క్రిష్ణ మూర్తి, భాగ్యరాజారెడ్డి, అంజలి, శంకర అఖిలపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.