Logo
Date of Publish : 07 January 2023, 2:43 pm
Editor : Sake Naresh

ఒక మెతుకు ఎవరికీ పెట్టని జబర్దస్త్ రోజా డౌన్ డౌన్ : గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిరసన….

        నెల్లూరు ( జనస్వరం ) : డౌన్ డౌన్ రోజా.. జబర్దస్థ్ రోజా ... డౌన్ డౌన్ రోజా రోజా... నోటి పొగరు రోజా.... డౌన్ డౌన్ రోజా అంటూ..... నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర  జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిరసన చేశారు.  ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ నోటి పొగురుతో అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అహంకారపు దోరణి లో ఎస్సీలని ఎస్టీలనీ అహంకారం తో వ్యవహరిస్తూ ప్రజలకు మధ్య వేలుని చూపిస్తూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు రోజా అంటూ ధ్వజమెత్తారు. రక్తదానం నేత్రదానం గురించి ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు,ఇప్పటికీ వారిస్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా వారి అభిమానుల నుంచి జనసేన పార్టీ నుంచి వస్తుందని తెలియ మీకు తెలియదా ? కరోణా సమయంలో ప్రభుత్వ వైఫల్యం చెందితే ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించిన వైనం మరిచారా, అదే సమయంలో సినిమా కార్మికులు ఇబ్బంది పడుతున్నప్పుడు కోట్ల రూపాయలు వారికి ఇంటికి సరుకులు అందించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. నోటికి వచ్చినట్లు మాట్లాడే రోజా గారు ప్రకృతి వైపరీత్యాలలో ఆర్దిక సహయం చేయటం లో జనసేన, మెగా హీరోలు మెగా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ముందుంటారు అనే మాట మర్చిపోయినట్లున్నారు. పదవి శాశ్వతం కాదు వ్యక్తిగత ప్రవర్తన కచ్చితంగా ఉండాలి రానున్న రోజుల్లో మీరు ప్రజా క్షేత్రంలో తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయం, పర్యాటక సంఘం గతంణలో దేశవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉంటే 18వ స్థానానికి తీసుకెళ్ళిన మీ ఘనతను ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుంటే టికెట్లు రేట్లు తగ్గించేస్తారు,ఏదైనా ఆవిర్భావ సభ జరుపుతామంటే ఫ్లెక్సీలు నిషేధిస్తారు, సభలో పెట్ట యువతను సన్మార్గంలో నడిపిస్తామంటే సభలు, ర్యాలీలు నిషేధం అంటారు. వై సిపీ నాయకులకు జంకు భయం మొదలైంది ఎక్కడ ప్రజలకు దగ్గరవుతారో ప్రతిపక్షాల అణిచివేద్దాం అనుకుంటునట్లున్నారు. మీరు మూట కట్టుకున్న పాపానికి రానున్న రోజుల్లో ప్రజలు సరైన తీర్పునిస్తారు. ఖబర్దార్ రోజా ఇప్పటికే డిఎస్పి గారికి కంప్లైంట్ చేసి ఉన్నాము. కచ్చితంగా నీ మీద స్థానిక స్టేషన్ లోన ఫిర్యాదు నమోదు చేయిస్తాం.నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ప్రజలందరికీ గాజు గ్లాస్ కి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తోడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ తో పాటు ఉమాదేవి, కృష్ణవేణి, నిర్మల, సుజాత, తులసి, నాగమణి, కంథర్ బాయ్, చిన్నరాజా, హేమంత్ యాదవ్, మౌనిష్, ప్రశాంత్ గౌడ్, ప్రతాప్, అమీన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com