పిఠాపురం, (జనస్వరం) : జోగా వెంకట రమణ ఆహ్వానం మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా పిఠాపురం పట్నం లో జె. జి. అర్. హాస్పిటల్ ఆధ్వర్యంలో Dr. శ్రీ జోగా వీర బాలాజీ గారు, Dr. శ్రీ జోగా లలిత ల నేత్రుత్వం లో వివిధ విభాగలకు చెందిన వైద్య మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులవల్ల ప్రజలు ఎదుర్కొనే అనారోగ్య ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు టిడిపి నాయకులు పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు PSN మూర్తి మాట్లాడుతూ ఇలా ఉచిత మెడికల్ వైద్య శిబిరాలు పెట్టడం వల్ల పేదలకు సరైన వైద్యం అందుతుందని అలాగే ఈ వైద్యం మందులు ఉచితంగా అందించినందుకు జే.జి.ఆర్.హాస్పిటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్, కర్రి కాశి,పెంకే జగదీష్, ముప్పన రత్నం, తోట సతీష్, పబ్బిరెడ్డి ప్రసాద్, కోలా దుర్గ దేవి, మరియు పి.ఎస్.ఎన్. మూర్తి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com